Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారికి గుడ్ న్యూస్.. ఆకస్మిక ఆస్తి యోగం కలిగే ఛాన్స్..

ఆస్తి సంబంధమైన వివాదాల్లో కోర్టు విచారణలో ఉన్న రాశుల వారిలో నాలుగు రాశుల వారికి ఈ ఏడాది విముక్తి లభించబోతోంది. కోర్టు కేసరి నుంచి విముక్తి లభించడంతో ఈ రాశుల వారికి..

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారికి గుడ్ న్యూస్.. ఆకస్మిక ఆస్తి యోగం కలిగే ఛాన్స్..
Zodiac Signs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 18, 2023 | 7:37 PM

ఆస్తి సంబంధమైన వివాదాల్లో కోర్టు విచారణలో ఉన్న రాశుల వారిలో నాలుగు రాశుల వారికి ఈ ఏడాది విముక్తి లభించబోతోంది. కోర్టు కేసరి నుంచి విముక్తి లభించడంతో ఈ రాశుల వారికి పెద్ద ఎత్తున ఆస్తులు సంక్రమించబోతున్నాయి. ఇది ఒక రకంగా ఆకస్మిక ఆస్తియోగంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఆస్తి వివాదాలకు బుధుడు కారకుడు. జాతక చక్రంలో 6, 11 స్థానాలు దీనికి సంబంధించిన రాశులు అవుతాయి. ఇక గురు గ్రహం తాలూకు అనుగ్రహం కూడా కొంత అవసరం. ఈ రకంగా చూస్తే మిధునం, సింహం, ధనస్సు కుంభరాశి వారు ఈ ఏడాది ఆకస్మిక ఆస్తి యోగాన్ని అనుభవించబోతున్నారు.

మిథున రాశి: ఈ రాశి వారికి సాధారణంగా అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు ఏర్పడుతుంటాయి. దాయాదుల కారణంగా ఆస్తులు కోర్టు కేసులలో మగ్గుతుంటాయి. అయితే చాలాకాలంగా కోర్టు విచారణలో ఉన్న ఆస్తి సంబంధమైన, ముఖ్యంగా స్థిరాస్తి సంబంధమైన కేసులు సానుకూలంగా పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. దీని ఫలితంగా వీరికి బాగా విలువైన ఆస్తులు చేతికి వచ్చి సంపన్నులు అవటానికి అవకాశం ఉంది. గ్రహ సంచారంలో బాగా అనుకూలంగా ఉండబోతున్న బుధుడు, లాభ స్థానంలో ఉన్న గురు రాహువులు ఇందుకు మార్గం సుగమం చేయడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్ 23 లోపు జరగటానికి అవకాశం ఉంది. ఈ రాశి వారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాల్సి ఉంటుంది. ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల సత్ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి బుధుడు ధన, లాభాధిపతి. ఈ గ్రహం ఈ రాశి వారికి ఈ ఏడాదంతా చాలా వరకు అనుకూలంగా ఉంది. పైగా భాగ్య స్థానంలో ఏప్రిల్ 23 తర్వాత గురు రాహువులు కలుస్తుండటం వల్ల, ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇల్లు పొలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశుల వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతుంటుంది. పెద్దల జోక్యంతో బంధువుల హస్తాల నుంచి ఆస్తిపాస్తులు ఈ రాశి వారికి అందే అవకాశం ఉంది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం వల్ల ఆస్తి వివాదాలు తప్పకుండా సానుకూలంగా పరిష్కారం అవుతాయి.

ఇవి కూడా చదవండి

ధను రాశి: ఈ ఏడాది ఈ రాశి వారు తప్పకుండా సోదరుల నుంచి ఆస్తిపాస్తులు దక్కించుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి వారికి తోబుట్టు వుల నుంచి లేదా తల్లిదండ్రుల నుంచి ఆస్తి సంబంధమైన వివాదాలు తలెత్తుతుంటాయి. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు ఈ ఏడాది శుభవార్త వినే అవకాశం ఉంది. ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతోంది. ఎక్కువగా కోర్టు బయట పరిష్కారానికే అవకాశం ఉంది. ఈ ఏడాది వీరికి బుదుడితో పాటు, గురు రాహు గ్రహాల అండ దండలు కూడా మెండుగా ఉండబోతున్నాయి. ఏప్రిల్ 23 తర్వాత జూలై 16 లోపు వీరి ఆస్తి వివాదానికి తెరపడటం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. వీరు దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల వాతావరణం సానుకూల పడుతుంది. తోబుట్టువులు కలసి వస్తారు.

కుంభ రాశి: ఆస్తి వివాదాల కారణంగా గత కొద్ది సంవత్సరా లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న ఈ రాశి వారికి ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత దీని నుంచి విముక్తి లభించే సూచనలు ఉన్నాయి. తండ్రి లేదా తండ్రికి సంబంధించిన బంధువుల నుంచి వీరికి ఆస్తి సంబంధమైన వివాదాలు తలెత్తుతుం టాయి. అయితే ఈ ఏడాది ఈ రాశి వారికి ఆకస్మిక ఆస్తియోగం పట్టే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. మధ్యవర్తుల జోక్యంతో వీరి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఒక్క పొలాలు లేదా స్థలాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా, ఇంటి సరిహద్దులకు సంబంధించిన వివాదం కూడా కోర్టు కేసు అవుతుంది. ఇటువంటి వివాదాలన్నీ బుధుడు గురువు రాహువు కారణంగా అతి వేగంగా సానుకూలంగా సెటిల్ అయిపోతుంది. వీరు ఒక 40 రోజులపాటు నరసింహస్వామి స్తోత్రాన్ని పఠించడం చాలా ఉపయోగంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..