Maha Shivaratri: నేడు శివరాత్రి, శనిత్రయోదశి.. ఈ రాశులపై శివయ్య అనుగ్రహం వెరీ వెరీ స్పెషల్..
శనివారం, శని త్రయోదశి, మహా శివరాత్రి కలిసి వచ్చిన నేడు.. శివయ్య అనుగ్రహం కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉంటాయని పండితులు చెప్పారు. ఈరోజు శివయ్య అనుగ్రహం పొందే ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సనాతన ధర్మం విశ్వాసాల ప్రకారం.. మహా శివరాత్రి రోజున శివుడిని పూజించడం ద్వారా భక్తులకు అన్ని బాధలు తొలగిపోతాయి. ఈ రోజున శివలింగానికి నీరు, పాలు, పెరుగు, బిల్వ పత్రం మొదలైన వాటిని సమర్పించడం ద్వారా శివుడు ప్రసన్నం అవుతాడని విశ్వాసం. వాస్తవానికి మహాశివరాత్రి రోజున శివ పార్వతుల కళ్యాణం జరిగింది. కనుక శివరాత్రి రోజున శివ పార్వతులను ఇద్దరినీ పూజించాలి. తనను కోరి కొలిచిన భక్తులపై భోళాశంకరుడు ఆశీర్వాదం కురిపించినా.. శనివారం, శని త్రయోదశి, మహా శివరాత్రి కలిసి వచ్చిన నేడు.. శివయ్య అనుగ్రహం కొన్ని రాశులపై ప్రత్యేకంగా ఉంటాయని పండితులు చెప్పారు. ఈరోజు శివయ్య అనుగ్రహం పొందే ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మిధునరాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మహాశివరాత్రి మిథున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు వీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే పనిలో విజయం పొందుతారు. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు తమ ఆఫీసులో మంచి అవకాశాలను పొందుతారు. ఈ రాశుల వారికి కూడా విశ్వాసం పెరుగుతుంది.
సింహరాశి సింహ రాశి వారికి మహా శివరాత్రి రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. సింహ రాశికి అధిపతి సూర్యుడు. కనుక వీలైతే ఈ రాశివారు ఈరోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజు వీరు చాలా మంచి అవకాశాలను పొందుతారు. మీరు సరిగ్గా ఉపయోగించినట్లయితే, గొప్ప ప్రయోజనం ఉంటుంది. అదే సమయంలో విద్యార్థులు విద్యా రంగంలో విజయం సాధిస్తారు.
కన్య రాశి శివయ్య ప్రత్యేక ఆశీర్వాదాలు ఈ రాశివారిపై ఉన్నాయి. ఈ రోజు శుభవార్తలను వింటారు. మానసిక ఒత్తిడిని తగ్గుతుంది. అదే సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే.. ఇది సమయం మంచిది. మీ జీవిత భాగస్వామితో వీరి సంబంధం బలంగా ఉంటుంది.
కుంభ రాశి కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లభిస్తుంది. కుటుంబం , స్నేహితుల మద్దతుతో వీరు పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరించగలుగుతారు. ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున నిరుపేదలకు దానం, దక్షిణ ఇవ్వడం మేలు చేస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)