AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shavana Masam: తీవ్రంగా డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా.. భక్తి శ్రద్దలతో ఈ పరిహారాలు చేయండి.. ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది..

శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో ప్రతి రోజూ విలువైనదే. ముఖ్యంగా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర మాసంలో తీసుకునే చర్యలు త్వరిత ఫలితాలను ఇస్తాయి. ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. లేదా ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటే. శ్రావణ మాసం, సోమవారం, శనివారం ఈ పరిహరాలను చేసి చూడండి..

Shavana Masam: తీవ్రంగా డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా.. భక్తి శ్రద్దలతో ఈ పరిహారాలు చేయండి.. ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది..
Shavana Masam
Surya Kala
|

Updated on: Jul 31, 2025 | 1:10 PM

Share

శ్రావణ మాసం ఆధ్యాత్మిక దృక్కోణంలో అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ నెలలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలో ఉండడం వలన శివుడు ప్రపంచాన్ని పోషిస్తాడని ఈ సమయంలో తనని పూజించే భక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపిస్తాడని నమ్మకం. కేవలం నీరు, మారేడు దళాలు సమర్పించినా సంతోషించి కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతారు.

ఈ నేపధ్యంలో ఎవరైనా ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుంటే ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే లేదా జీవితంలో శ్రేయస్సు కోసం శ్రావణ మాసంలో చేసే ఈ 8 ప్రభావవంతమైన చర్యలు మీ విధిని మార్చగలవు. ఈ పరిహరాలను చేసేందుకు ఖర్చు తక్కువ అవుతుంది. అయితే ప్రభావం మాత్రం చాలా విలువైనది. అయితే వీటిని చేయడానికి కావలసిందల్లా దేవుడికి మీద భక్తి విశ్వాసం.

శ్రేయస్సు కోసం చేయాల్సిన 8 పరిహారాలు

ఇవి కూడా చదవండి

ప్రతి సోమవారం శివలింగానికి నీరు, పాలు సమర్పించండి. ఉదయం స్నానం చేసిన తర్వాత శివలింగానికి నీరు, పచ్చి పాలు, బిల్వ పత్రాలను సమర్పించండి. ఇలా చేయడం వలన శివుడు ప్రసన్నం అవుతాడు. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాడు.

ఇంటి ఈశాన్య మూలను శుభ్రంగా, చక్కగా ఉంచండి. ఈశాన్య దిశను లక్ష్మీదేవి నివాసస్థానంగా భావిస్తారు. దానిని శుభ్రంగా, సువాసనగా ఉంచడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది.

గంగాజలాన్ని కలిపి నీటిని రోజూ ఇంట్లో చల్లండి గంగాజలాన్ని నీటితో కలిపి ఇల్లంతా చల్లుకోండి. రోజూ ఈ పరిహారం చేయడం వలన ప్రతికూల శక్తి తొలగుతుంది.. సానుకూలతను పెరుగుతుంది.

శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనెతో లేదా నువ్వుల నూనేతో దీపం వెలిగించండి. ఈ పరిహారం ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

శివుడికి తెల్లటి వస్తువులను సమర్పించండి. సోమవారం రోజున శివలింగానికి తెల్ల బియ్యం, పాలు, పెరుగు లేదా చక్కెర మిఠాయిని సమర్పించండి. ఈ పరిహారం లక్ష్మీ దేవి మీ ఇంట్లో శాశ్వతంగా నివసించేలా చేస్తుంది.

మహామృత్యుంజయ మంత్రం లేదా శివ చాలీసా పఠించండి శ్రావణ మాసంలో ప్రతి ఉదయం లేదా సాయంత్రం శివ చాలీసా చదవండి లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఇది మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.

పేదలకు ఆహారం, బట్టలు దానం చేయండి శ్రావణ మాసంలో ఏదైనా సోమవారం లేదా శనివారం నాడు పేదవారికి ఆహారం, బట్టలు లేదా ధాన్యాన్ని దానం చేయండి. ఇలా చేయడం పుణ్య కార్యమే కాదు. లక్ష్మీ ప్రాప్తికి మార్గం తెరుస్తుంది.

సేఫ్‌లో జత వెండి పాములను ఉంచండి. శ్రావణ మాసంలో జంట వెండి పాములను కొని వాటిని పూజించి మీరు డబ్బులు దాచుకునే ప్లేస్ లో భద్రపరుచుకోండి. ఇది సంపదను పెంచుతుంది. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తుంది.

భక్తితో పూజిస్తే తప్పకుండా ఫలితం శ్రావణ మాసం ఆధ్యాత్మికత ,శక్తి ల సంగమం. ఈ పవిత్ర మాసంలో తీసుకునే ఈ చిన్న చిన్న చర్యలను భక్తితో, క్రమం తప్పకుండా చేస్తే, సంపద, శాంతి , పురోగతికి మార్గం తెరుచుకుంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.