AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Epic Story: హిందూమతంలో ఏ పాము శక్తిగలది.. శేష నాగ, వాసుకి, తక్షకుడిలో అత్యంత శక్తివంతమైన పాము ఏది?

హిందూమతంలో పాములను దైవంగా భావించి పూజిస్తారు. నాగులకు ఒక ప్రత్యేక లోకం ఉంటుందని వాటికీ దైవ శక్తి ఉంటుందని నమ్మకం. ముఖ్యంగా అష్ట నాగులను నాగ పంచమి, నాగుల చవితి వంటి ప్రత్యేక పర్వదినాల్లో పుజిస్తారు. శేషనాగు, వాసుకి, తక్షక, కర్కోటక, పద్మ, మహాపద్మ, శంఖ అనేవి అష్టనాగులు. ఇవి హిందూ పురాణాలలో ముఖ్యమైన నాగులు లేదా సర్ప దేవతలు. అయితే ఈ నాగులలో శేష నాగు, వాసుకి, తక్షకుడు గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది. వీటిల్లో ఏ సర్పం అత్యంత శక్తివంతమైనదో తెలుసా..

Hindu Epic Story: హిందూమతంలో ఏ పాము శక్తిగలది.. శేష నాగ, వాసుకి, తక్షకుడిలో అత్యంత శక్తివంతమైన పాము ఏది?
Hindu Epic Story
Surya Kala
|

Updated on: Jul 31, 2025 | 12:13 PM

Share

హిందూ మతంలో పాములను దేవతలుగా భావిస్తారు. పూజిస్తారు. పాములకు సంబంధించిన అనేక కథలు పురాణ గ్రంథాలలో కూడా వివరించబడ్డాయి. హిందూ పురాణాల్లో 8 పాముల ప్రస్తావన ఉంది. వీటిని అష్టనాగులు అని పిలుస్తారు. అయితే ఈ 8 పాములలో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడే 3 పాములు ఉన్నాయి. ఈ మూడు పాములు శేష నాగు, వాసుకి, తక్షకుడు. ఈ మూడు పాముల గురించి భిన్నమైన నమ్మకాలు, కథలు ఉన్నాయి.

శేషనాగు ఎవరు?

శేషనాగు కశ్యప ఋషి, కద్రుని పెద్ద కుమారుడు. ఇతనే సృష్టిలో మొదటి సర్పం. శేష నాగు తమ్ములే వాసుకి, తక్షకుడు, కాలియా వంటివారు. శేషనాగును “అనంత” అని కూడా పిలుస్తారు, అంటే “అంతం లేనివాడు”. హిందూ మతంలో శేష నాగు శ్రీ మహా విష్ణువు తల్పంగా మారి సేవలను అందిస్తున్నాడు. శేషనాగు వెయ్యి పడగలు కలిగి ఉన్నాడు. అతను భూమి బరువును తన తలపై మోస్తున్నాడని నమ్మకం.

ఇవి కూడా చదవండి

వాసుకి నాగ ఎవరు? వాసుకి సర్పాలకు రాజుగా పరిగణించబడ్డాడు. అంతేకాదు సృష్టి లయకారుడైన శివుడి మెడలో ఆభరణంగా వాసుకి చోటు దక్కింది. వాసుకికి వంద పడగలు ఉన్నాయి. శేషనాగుడి తర్వాత వసుకీ సర్పాలకు రాజుగా నియమించబడ్డాడు. అతను యుగాలుగా సర్పాలను పరిపాలించాడు.

తక్షక నాగ ఎవరు? మహాభారతంలో ప్రస్తావించబడిన తక్షకుడు అన్ని పాములలో అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతున్నాడు. ఇంద్రుడికి మంచి స్నేహితుడు తక్షకుడు. అర్జునుడి మనవుడైన పరీక్షిత్ రాజును తక్షకుడు కాటు వేయడంతో మరణించాడు.

శేష నాగ విష్ణువు సేవకుడు: శేషనాగ విష్ణువు సేవకుడు. “అనంత” అని కూడా పిలుస్తారు. అంటే “అనంతం” లేదా “అంతులేనివాడు”.

విష్ణు శయనం: శేష నాగు శయనంగా మారి శ్రీ మహా విష్ణువు పాన్పుగా, శేషతల్పంగా శయనించే రీతిలో ఉన్నాడు. అందుకే శ్రీ మహా విష్ణువుని శేషశయన వాసుడు అని పిలుస్తారు.

విశ్వ సమతుల్యత: శేషనాగును విశ్వ సమతుల్యతకు చిహ్నంగా కూడా పరిగణిస్తారు.

భూమి బరువు: శేషనాగు తన పడగ మీద భూమిని మోస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

అవతారం: శ్రీ మహా విష్ణువు శ్రీ రాముడిగా అవతారం దాల్చినప్పుడు శేష నాగ లక్ష్మణుడుగా.. శ్రీ కృష్ణుడిగా అవతారం ఎత్తిన సమయంలో శేషుడు బలరాముడిగా అవతరించాడు.

వాసుకి పాము శివుని సేవకుడు: వాసుకిని శివునికి అత్యంత ప్రియమైన సేవకుడిగా, పరమ భక్తుడిగా భావిస్తారు. ఆయనను శివుని మెడలో చుట్టుకుని ఆభరణంగా మారి శివుడితో పాటు భక్తులతో పూజలను అందుకుంటుంది.

సముద్ర మంథనం: సముద్ర మంథనం సమయంలో మందర పర్వతాన్ని చుట్టుకుని వాసుకి నాగ తాడుగా మారి.. అమృత మథనం సమయంలో ఉపయోగిపడినట్లు మత విశ్వాసం.

త్యాగం, సేవ: సముద్ర మథనం సమయంలో వాసుకి తనను తాను అంకితం చేసుకున్నందున ఆయన త్యాగం, సేవకు చిహ్నంగా పరిగణించబడ్డాడు.

పాముల రాజు: వాసుకిని పాముల రాజు అని కూడా పిలుస్తారు. నాగలోక ప్రభువుగా భావిస్తారు.

తక్షకుడు అత్యంత ప్రాణాంతకం: తక్షకుడు తన శక్తి, విషంతో ప్రసిద్ధి చెందాడు. ఈ పాము విషం మొత్తం ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనదని చెబుతారు.

జననం: తక్షకుడికి కూడా కశ్యప , కద్రువులే తల్లిదండ్రులు. స్వర్గాన్ని ఏలే ఇంద్రుడు తక్షకుడికి మంచి స్నేహితుడు.

నివాసం: తక్షకుడు నాగ పాతాళ లోకంలో నివసిస్తాడు.

అత్యంత క్రూరుడు: తక్షక నాగుడు అన్ని పాములలోకి అత్యంత భయంకరమైన, క్రూరమైన.. ఎగిరే లక్షణం ఉన్న పాము అని మహాభారతం చెబుతోంది.

హిందూ పురాణాల ప్రకారం శేషనాగును అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భావిస్తారు. ఎందుకంటేశేషుడు విష్ణువుతో సంబంధం కలిగి ఉన్నాడు. విశ్వం బరువును మోస్తున్నాడు. వాసుకి కూడా శక్తివంతుడే. ఇతను శివ భక్తుడు. శివుడితో సంబంధం ఉందని ప్రస్తావించబడ్డాడు. తక్షక నాగుడు కూడా చాలా విషపూరితమైనవాడు. శక్తివంతమైనవాడు. అయితే శేషనాగు, వాసుకి వంటి సర్పలకంటే భిన్నమైన ఆలోచన, వ్యక్తిత్వం కలిగిన వాడు. కనుక శేషనాగు, తక్షక , వాసుకి నాగులలో.. శేషనాగు అత్యంత శక్తివంతమైన సర్పంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.