రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తుల నివాసం పెద్దలు చెప్పే దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే

రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతారు? అంతేకాదు రాత్రి పూట రావి చెట్టును తాకకూడదు. ఇలాంటి ఎన్నో విషయాలు వినే ఉంటారు. అయితే వీటన్నింటికీ అసలు ఆధారం ఏమిటి? ఇది నిజంగా నిజమా లేక కేవలం మూఢనమ్మకమా లేక దీనిలో శాస్త్రీయ కోణం దాగి ఉందా ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం.. 

రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తుల నివాసం పెద్దలు చెప్పే దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే
Peepal Tree
Follow us

|

Updated on: Apr 23, 2024 | 8:20 PM

పురాణగ్రంధాల్లో రావి చెట్టు విష్ణువు  స్వరూపంగా పరిగణించబడుతుంది. అందువల్ల హిందూ మతంలో రావి  చెట్టు ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. పూజా కార్యక్రమాలను రావి చెట్టు కింద చేస్తారు. మత విశ్వాసాల ప్రకారం ప్రతి శనివారం రావి చెట్టు క్రింద ఆవాల నూనె దీపం వెలిగించడం జీవితంలో ఆనందం, శాంతిని కలిగిస్తుంది.

అయితే రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయని పెద్దలు చెబుతారు? అంతేకాదు రాత్రి పూట రావి చెట్టును తాకకూడదు. ఇలాంటి ఎన్నో విషయాలు వినే ఉంటారు. అయితే వీటన్నింటికీ అసలు ఆధారం ఏమిటి? ఇది నిజంగా నిజమా లేక కేవలం మూఢనమ్మకమా లేక దీనిలో శాస్త్రీయ కోణం దాగి ఉందా ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం..

శాస్త్రీయ విధానం ప్రకారం

రాత్రి సమయంలో రావి చెట్టు లేదా ఇతర చెట్ల కింద పడుకోవడం నిషేధించబడింది ఎందుకంటే చెట్లు రాత్రిలో కార్బన్ డయాక్సైడ్‌ను గాలిలోకి విడుదల చేస్తాయి. మానవ శరీరానికి అది మంచిది కాదు, ఎక్కువ సమయం కార్బన్ డయాక్సైడ్ పీలిస్తే శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. అందుకే రాత్రి సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్లకూడదని అంటారు.

ఇవి కూడా చదవండి

పురాణ గ్రంథాల ప్రకారం

హిందూ మతంలో రావి చెట్టును దైవ స్వరూపంగా భావిస్తారు. విశ్వాసం ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు రావి చెట్టులో నివసిస్తారు. మహావిష్ణువు రావి చెట్టు  మూలాలలో, కేశవుడు కాండం.. సకల దేవతలు ఆకులలో నివసిస్తున్నట్లు పురాణాలలో చెప్పబడింది. అందువల్ల రావి చెట్టును పూజిస్తారు. కనుక గ్రంధాల ప్రకారం రాత్రి సమయంలో రావి చెట్టు కిందకు వెళ్లడం లేదా నిద్రించడం శుభప్రదంగా పరిగణించబడదు.

రావి చెట్టులో ఆత్మలు నివసిస్తాయా?

పురాణ గ్రంధాల ప్రకారం రావి చెట్టుపై ఆత్మలు నివసిస్తాయనేది కేవలం ఊహాత్మకమైనవి. గ్రంథాలలో రావి  చెట్టును దేవతల మొక్కగా పరిగణిస్తారు. కనుక ఈ చెట్టులో ఆత్మ నివసిస్తుందనేది మనుషులు రాత్రి ఈ చెట్టుకు దూరంగా ఉంచడానికి మాత్రమే అని శాస్త్రీయ కోణంలో రాత్రిపూట రావి చెట్టు దగ్గరికి వెళ్లకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?