Delhi: శ్రీ రాముడి ఫొటోలున్న పేపర్ ప్లేట్లలో చికెన్ బిర్యానీ అమ్మకం.. జనం ఆగ్రహం.. యజమాని అరెస్ట్
సుగుణాల రామయ్యను ప్రతి ఇళ్లు సొంతం చేసుకుంది. సీతారాములుగా భార్యాభర్తలు ఉండాలని పెద్దలు దీవిస్తారు. తమ పిల్లలు రామ లక్ష్మణుల్లా జీవించాలని కోరుకుంటారు. తన కొడుకు రాముడిగా ఉండాలని తండ్రి ఆశిస్తాడు. దైవంగా భావించి పూజించే శ్రీరాముడిని అవమానించిన సంఘటనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. శ్రీరాముడి చిత్రాలతో కూడిన ప్లేట్లలో బిర్యానీ వడ్డిస్తున్న షాకింగ్ విజువల్స్ ను చూపిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో బిర్యానీ జాయింట్ షాప్ లో చోటు చేసుకుంది.

శ్రీ రాముడు హిందువుల ఆరాధ్య దైవం.. మానవుడిగా పుట్టి నడక, నడతతో దైవముగా పూజలను అందుకుంటున్నాడు. రాముడు ప్రతి ఇంట్లో మంచి అన్న, మంచి కొడుకు , మంచి భర్త , మంచి పాలన అందించిన రాజు.. అందుకే సుగుణాల రామయ్యను ప్రతి ఇళ్లు సొంతం చేసుకుంది. సీతారాములుగా భార్యాభర్తలు ఉండాలని పెద్దలు దీవిస్తారు. తమ పిల్లలు రామ లక్ష్మణుల్లా జీవించాలని కోరుకుంటారు. తన కొడుకు రాముడిగా ఉండాలని తండ్రి ఆశిస్తాడు. దైవంగా భావించి పూజించే శ్రీరాముడిని అవమానించిన సంఘటనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
శ్రీరాముడి చిత్రాలతో కూడిన ప్లేట్లలో బిర్యానీ వడ్డిస్తున్న షాకింగ్ విజువల్స్ ను చూపిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో బిర్యానీ జాయింట్ షాప్ లో చోటు చేసుకుంది. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీ రాముడు ఫొటోలున్న వీడియో వైరల్..
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో శ్రీ రాముడి ఫోటోలు ముద్రించి ఉన్న కాగితపు ప్లేట్స్ ఉన్న ఉన్నాయి. ఒక చికెన్ బిర్యానీ షాప్ దగ్గర భారీగా జనం పోగయ్యారు. బిర్యానీ షాప్ యజమాని రామయ్యని అవమానిస్తూ చికెన్ బిర్యానీని రాముడి ఫొటోలున్న ప్లేట్స్ లో బిర్యానీ అమ్ముతున్నాడు అన్న విషయం తెలిసి అక్కడ జనం భారీగా చేరుకున్నట్లు తెలుస్తోంది. తరువాత రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. సంఘటపై విచారణ చేసినట్లు.. దుకాణ యజమానిని తమ అదుపులోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.
రాముడి చిత్రాలు ఉన్న పేపర్ ప్లేట్‌లపై బిర్యానీ వడ్డిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు
Jahangirpuri, Delhi: Biriyani was being served on paper plates with images of Lord Rama, locals and Bajrang dal object and complained to Police.
Investigation on…..https://t.co/gcojcxZYgU pic.twitter.com/HgxcgFEnke
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 23, 2024
సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు, బజరంగ్ దళ్ సభ్యులు ఆ ప్లేట్‌లలో బిర్యానీ అమ్మడంపై దుకాణ యజమాని తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్కసారిగా దుకాణం వద్ద కలకలం రేగింది. పేపర్ ప్లేట్ల బండిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్లేట్లలో శ్రీరాముడి ఫోటోలు ఉన్నాయని.. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి చెప్పారు.
అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులు మార్కెటింగ్ కోసం ఇలా చేశారా లేక ఉద్దేశ్యపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తినుబండారాల అమ్మకం పెరగడం కోసం మత మనోభావాలను దెబ్బతీసే సంఘటన వెలుగులోకి రావడంతో, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.