విందు అంటే ఇది.. రిసెప్షన్‌లో వేసవి దాహార్తిని తీర్చే తాటి ముంజలు సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
పెళ్లి వేడుకలో విందుని బిర్యానీ, పులిహోర, రకరకాల కూరలు, వివిధ రకాల టిఫిన్స్ తో పాటు దాహార్తిని తీర్చడానికి కూల్ డ్రింక్స్, షోడాలు, ఐస్ క్రీమ్ లు , జ్యుస్ లు వంటి రకరకాల ఆహార పదార్ధాలతో అతిధులకు అందిస్తున్నారు. అయితే ఓ పెళ్లి వేడుకలో బంధువులు, స్నేహితులు ఛిల్ అయ్యేందుకు విందులో వెరైటీ ఆహారాన్ని అందించారు. హైదరాబాద్ లోని మన్నెగూడలోని బీఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్‌లో జరిగిన ఒక పెళ్లి రిసెప్షన్ వేడుకలో వేసవి దాహార్తిని తీర్చేందుకు అందరు ఇష్టంగా తినే తాటి ముంజలను ఏర్పాటు చేశారు.

పెళ్లి ముహర్తలు తక్కువగా ఉండడంతో ఎక్కడ చూసినా పెళ్లి సందడి కనిపిస్తుంది. కల్యాణ మండపాలు వధూవరులు, బంధువులతో కళకళలాడుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఘనంగా వివాహం జరిపిస్తున్నారు. భాజాభజంత్రిలు, విందు వినోదాలు తో పెళ్లి వేడుక ఘనంగా జరుపుతున్నారు. పెళ్లి వేడుకలో విందుని బిర్యానీ, పులిహోర, రకరకాల కూరలు, వివిధ రకాల టిఫిన్స్ తో పాటు దాహార్తిని తీర్చడానికి కూల్ డ్రింక్స్, షోడాలు, ఐస్ క్రీమ్ లు , జ్యుస్ లు వంటి రకరకాల ఆహార పదార్ధాలతో అతిధులకు అందిస్తున్నారు. అయితే ఓ పెళ్లి వేడుకలో బంధువులు, స్నేహితులు ఛిల్ అయ్యేందుకు విందులో వెరైటీ ఆహారాన్ని అందించారు.
హైదరాబాద్ లోని మన్నెగూడలోని బీఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్‌లో జరిగిన ఒక పెళ్లి రిసెప్షన్ వేడుకలో వేసవి దాహార్తిని తీర్చేందుకు అందరు ఇష్టంగా తినే తాటి ముంజలను ఏర్పాటు చేశారు. పల్లెల్లో దొరికే ఈ తాటి ముంజెలను అప్పటి కప్పుడు కొట్టించుకుని అతిధులు ఎంతో ఇష్టంగా తిన్నారు.
ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ఐస్ యాపిల్స్ ను చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఇష్టంగా తిన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఈ తాటి ముంజెలు వేసవి లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా చెప్పాలంటే శరీరానికి చల్లదనం ఇస్తాయి కనుక ఐస్ యాపిల్ అని అంటారు. దీనిలో ఏ, బీ, సీ విటమిన్లతో పాటు జింక్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం మొదలైన శారీరక పోషణ ఇచ్చే ఖనిజాలు కూడా ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..