అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన చిన్నది.. కట్ చేస్తే.. దిమ్మదిరిగే బొమ్మ కనిపించిందిగా
పండగలు, పర్వదినాలు మాత్రమే కాదు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరిగినా మహిళలు తమ అందాన్ని పెంచుకునేందుకు ముందుగా బ్యూటీపార్లర్‌కు వెళతారు. పార్లర్‌కి వెళ్లి ముఖ సౌందర్యానికి మెరుగులు దిద్దుకుంటారు. ఇలా బ్యూటీ పార్లర్ కు వెళ్లిన ఓ యువతి మర్నాడు తన ముఖం చూసుకుని తానే షాక్ తింది. పార్లర్‌కు వెళ్లిన ఆ యువతి ముఖం వింతగా ఉండడమే కాదు కళ్లు పూర్తిగా వాచిపోయాయి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది

మహిళలకు అందంగా ఉండడం అంటే ఇష్టం.. తాము అందంగా కనిపించడానికి రకరకాల చిట్కాలను ఉపయోగిస్తారు. అంతేకాదు మహిళలకు బ్యూటీ పార్లర్ చాలా ఇష్టమైన ప్రదేశం. పండగలు, పర్వదినాలు మాత్రమే కాదు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరిగినా మహిళలు తమ అందాన్ని పెంచుకునేందుకు ముందుగా బ్యూటీపార్లర్‌కు వెళతారు. పార్లర్‌కి వెళ్లి ముఖ సౌందర్యానికి మెరుగులు దిద్దుకుంటారు. ఇలా బ్యూటీ పార్లర్ కు వెళ్లిన ఓ యువతి మర్నాడు తన ముఖం చూసుకుని తానే షాక్ తింది. పార్లర్‌కు వెళ్లిన ఆ యువతి ముఖం వింతగా ఉండడమే కాదు కళ్లు పూర్తిగా వాచిపోయాయి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది.
ఆ యువతి పేరు డానియెల్ హబ్బర్డ్. మిర్రర్ నివేదిక ప్రకారం డానియెల్.. మాల్టాలో 12 పౌండ్ల విలువైన బ్యూటీ ట్రీట్‌మెంట్‌ను బుక్ చేసుకుంది. (అంటే దాదాపు మన దేశ కరెన్సీలో రూ. 1237). “బ్యూటీషియన్ ఆ యువతి చర్మం తీరు గురించి ఎలాంటి పరీక్ష చేయలేదు. అయితే బ్యూటీ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఐబ్రోస్ ను షేప్ చేయించుకుని కలర్ వేయించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు ఆ డానియెల్ ముఖం బాగానే ఉంది. అయితే మరుసటి రోజు ఉదయం ఆ యువతి ఎడమ కన్ను బాగా ఉబ్బింది.

Danielle
ఈ విషయంపై డానియెల్ స్పందిస్తూ బ్యూటీషియన్ తనకు స్కిన్ ఎలర్జీ టెస్ట్ చేయకుండానే నేరుగా కనుబొమ్మలకు రంగు వేసిందని పేర్కొంది. దీంతో మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి తన కన్ను పూర్తిగా వాచిపోయింది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. రాయల్ బ్లాక్‌బర్న్ హాస్పిటల్‌లో అలెర్జీని తగ్గించేందుకు చికిత్సగా ఆమెకు స్టెరాయిడ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది. దీని తర్వాత ఆమె మళ్లీ బ్యూటీపార్లర్‌కు వెళ్లి, ఫిర్యాదు చేసి, నష్టపోయిన డబ్బును తిరిగి పొందాలని ప్రయత్నించింది, అయితే బ్యూటీషియన్ తన తప్పుకు పశ్చాత్తాపపడలేదు, క్షమాపణ చెప్పలేదు. అందుకే బ్యూటీ పార్లర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డేనియల్ లాయర్ ను ఆశ్రయించినట్లు వెల్లడించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..