భార్య సువర్చలతో కలిసి పూజలను అందుకుంటున్న హనుమంతుడు.. దంపతులు దర్శించుకుంటే ప్రేమ చెదరదు అని నమ్మకం
హనుమంతుడికి కూడా వివాహం జరిగినట్లు కొన్ని కథలు వినిపిస్తూ ఉంటాయి. ఆ విషయాన్నీ రుజువు చేసే ఆలయం ఒకటి ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హనుమంతుడిని వివాహితుడిగా పరిగణిస్తారు. తెలంగాణలో హనుమంతుని వివాహితుడిగా భావించే ఒక ఆలయం ఉంది. హైదరాబాద్ నుండి 220 కి.మీ దూరంలో ఖమ్మం జిల్లాలో హనుమంతు, అతని భార్య సువర్చల దేవాలయం ఉంది. ఇది పురాతన దేవాలయం. ఇక్కడ హనుమంతుడితో పాటు భార్య సువర్చల విగ్రహం ఉంది.

రామాయణం ప్రకారం వాయునందనుడు రామ భక్త హనుమాన్ సీతాదేవికి అత్యంత ప్రియమైన వ్యక్తి. పవనసుతుడు హనుమంతుడు అమరత్వం పొందిన సప్త ఋషుల్లో బజరంగబలి కూడా ఒకరు. హిందూ సనాతన ధర్మంలో హనుమంతుడిని బాల బ్రహ్మచారిగా పరిగణిస్తుంది. అయితే హనుమంతుడికి కూడా వివాహం జరిగినట్లు కొన్ని కథలు వినిపిస్తూ ఉంటాయి. ఆ విషయాన్నీ రుజువు చేసే ఆలయం ఒకటి ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హనుమంతుడిని వివాహితుడిగా పరిగణిస్తారు.
తన భార్యతో కలిసి ఆలయంలో కూర్చున్న బజరంగబలి
తెలంగాణలో హనుమంతుని వివాహితుడిగా భావించే ఒక ఆలయం ఉంది. హైదరాబాద్ నుండి 220 కి.మీ దూరంలో ఖమ్మం జిల్లాలో హనుమంతు, అతని భార్య సువర్చల దేవాలయం ఉంది. ఇది పురాతన దేవాలయం. ఇక్కడ హనుమంతుడితో పాటు భార్య సువర్చల విగ్రహం ఉంది. ఎవరైతే హనుమంతుని, అతని భార్యను దర్శించుకుంటారో ఆ భక్తుల వైవాహిక జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు.
హనుమంతుడి భార్య ఎవరో తెలుసా
ఈ ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న నమ్మకాల ప్రకారం హనుమంతుని భార్య పేరు సువర్చల. ఆమె సూర్యభగవానుడి కుమార్తె. ఇక్కడ హనుమంతుడి సువర్చల పురాతన దేవాలయం ఉంది. అంతేకాదు పరాశర సంహితలో హనుమంతుడి సువర్చల వివాహ కథ కూడా ఉంది.
హనుమన్ వివాహం ఎలా జరిగిందంటే
పురాణాల ప్రకారం హనుమంతుడు సూర్య భగవానుడి నుంచి జ్ఞానాన్ని పొందుతున్నాడు. సూర్య భగవానుడు నవ వ్యాకరణ పండితుడు. సూర్యుడు తనకు ఉన్న 9 విద్యలలో 5 విద్యలను హనుమంతుడి నేర్పించాడు. అయితే మిగిలిన విద్యలను హనుమమంతుడు పొందాలంటే వివాహం చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే హనుమంతుడు సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేడు. అప్పుడు ఆయన ముందు ఒక సమస్య తలెత్తింది. ఎందుకంటే ఆయన బాల బ్రహ్మచారి. దీంతో ఈ సమస్యకు సూర్యుడు ఒక పరిష్కారం కనుగొన్నాడు. తన శక్తితో ఆడపిల్లకు ప్రాణం పోశాడు.పేరు సువర్చల. సువర్చలను పెళ్లి చేసుకోమని సూర్యుడు బజరంగబలిని అడిగాడు. హనుమంతుడు సువర్చలతో వివాహమైన తర్వాత కూడా బ్రహ్మచారిగా ఉంటాడని.. ఎందుకంటే వివాహానంతరం సువర్చల తపస్సులో మునిగిపోతుందని సూర్య దేవుడు చెప్పాడు. దీంతో పవన తనయుడు పెళ్లి చేసుకున్నా బ్రహ్మచారిగా నిలిచిపోయాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు