Hanuman Jayanti: ఆర్ధిక కష్టాలా.. ఈ రోజు సాయంత్రం హనుమంతుడికి ఇవి సమర్పించండి.. అనుగ్రహం మీ సొంతం
దేశంలోని అన్ని హనుమంతుడి ఆలయాల్లో బజరంగబలి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. మీరు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. ఈ రోజు సాయంత్రం సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించి బజరంగబలి అనుగ్రహాన్ని పొందడం ద్వారా మీ ఉపవాసాన్ని పూర్తి చేసుకోవచ్చు. హనుమంతుని అనుగ్రహంతో అన్ని రకాల కష్టాలు క్షణాల్లో తొలగిపోతాయని నమ్ముతారు.

హిందూ మతంలో ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ రోజున హనుమంతుడి జన్మదినోత్సవ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దేశంలోని అన్ని హనుమంతుడి ఆలయాల్లో బజరంగబలి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. మీరు హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. ఈ రోజు సాయంత్రం సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించి బజరంగబలి అనుగ్రహాన్ని పొందడం ద్వారా మీ ఉపవాసాన్ని పూర్తి చేసుకోవచ్చు. హనుమంతుని అనుగ్రహంతో అన్ని రకాల కష్టాలు క్షణాల్లో తొలగిపోతాయని నమ్ముతారు.
మంగళవారం హనుమంతుడి జయంతి రావడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఎందుకంటే మంగళవారం రామ భక్త హనుమంతుడికి అంకితం చేయబడింది. మంగళవారం నాడు ఆచారాల ప్రకారం బజరంగబలిని పూజించడం ద్వారా అన్ని అడ్డంకుల నుంచి విముక్తి పొంది, కోరుకున్న ఫలితాలను పొందుతారు. జాతకంలో మంగళదోషం ఉన్నవారు మంగళవారం రోజున చేసే పూజల వల్ల విశేష ప్రయోజనాలను పొందుతారు. హనుమంతుని మార్గాన్ని అనుసరించే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
సాయంత్రం వేళ సమర్పించాల్సిన కొన్ని ప్రత్యేక వస్తువులు
- మిఠాయి అంటే హనుమంతుడికి చాలా ఇష్టం. కనుక మంగళవారం సాయంత్రం పూజ సమయంలో హనుమంతుడికి బూందీ సమర్పించండి. ఇలా చేయడం వలన హనుమంతుడు త్వరగా సంతోషిస్తాడు. కోరిన కోరికలన్నింటినీ తీరుస్తాడు.
- రామ భక్త హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి తమలపాకులు సమర్పించండి. హనుమంతునికి తమలపాకులు సమర్పించడం ద్వారా జీవితంలోని ప్రతి సమస్య నుంచి ఉపశమనం పొందుతారని నమ్మకం.
- ఆంజనేయస్వామికి తులసి దళాలు తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే తులసి ఆకులు లేకుండా అతని కడుపు నిండదు. కాబట్టి ఆయనకు సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను చేర్చండి.
- బజరంగబలికి తులసి దళాలను నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. హనుమంతునికి తులసి దళాలను నైవేద్యంగా సమర్పించడం వలన విశేష ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.
- కథ ప్రకారం ఒకసారి సీత దేవి హనుమంతునికి ఆహారం పెడుతోంది. హనుమంతుడు ఉదయం నుండి సాయంత్రం వరకు అలా తింటూనే ఉన్నాడు. అయినప్పటికీ అతని కడుపు నిండలేదు. దీంతో సీతమ్మ చాలా కలత చెంది రామయ్యని దీనికి కారణం అడిగింది. హనుమంతుడికి రెండు తులసి దళాలు తినిపిస్తే వెంటనే కడుపు నిండుతుంది శ్రీ రాముడు చెప్పాడు. సీతమ్మ కూడా అలాగే చేసి హనుమంతుని కడుపు నింపింది.
- సంకట మోచన హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం. అటువంటి పరిస్థితిలో మంగళవారం, శనివారం వారికి సింధూరం సమర్పించండి. ఈ రోజున సింధూరంలో జాస్మిన్ ఆయిల్ మిక్స్ చేసి హనుమంతుడికి అప్లై చేయండి. ఇలా చేయడం వలన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు








