Ayodhya: ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

వందల ఏళ్లుగా ఎదురుచూసిన కోట్లాదిమంది హిందువుల కలను నిజం చేస్తూ అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు నేత్రపర్వంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగిన నాటినుంచి ఇప్పటివరకు ఏకంగా 1.5 కోట్ల మంది భక్తులు రామ్‌లల్లాను దర్శనం చేసుకున్నారు. ప్రతి రోజూ లక్ష మందికిపైగా భక్తులు మహా అయోధ్య రామ మందిరాన్ని సందర్శిస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు.

Ayodhya: ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

|

Updated on: Apr 22, 2024 | 10:11 PM

వందల ఏళ్లుగా ఎదురుచూసిన కోట్లాదిమంది హిందువుల కలను నిజం చేస్తూ అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు నేత్రపర్వంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగిన నాటినుంచి ఇప్పటివరకు ఏకంగా 1.5 కోట్ల మంది భక్తులు రామ్‌లల్లాను దర్శనం చేసుకున్నారు. ప్రతి రోజూ లక్ష మందికిపైగా భక్తులు మహా అయోధ్య రామ మందిరాన్ని సందర్శిస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు. ఇటీవలే తొలి శ్రీరామనవమి వేడుకలను అయోధ్య ఆలయంలో వైభవంగా నిర్వహించామని, ఆ రోజు దాదాపు 19 గంటల పాటు ఆలయాన్ని తెరచివుంచామని తెలిపారు.

రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిన ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయ్యిందని, మొదటి అంతస్తులో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పుతో ప్రాకారాన్ని నిర్మించనున్నామని, దీనిని ఆలయ ‘పర్కోట’ అంటారని వివరించారు. ఈ ప్రాకారం బహుళ ప్రయోజనంగా ఉంటుందన్న ఆయన, మరో 6 ఆలయాలు నిర్మించనున్నట్టు తెలిపారు. భగవాన్‌ శంకరుడు, సూర్య భగవానుడు, ఒక గర్భగృహం, రెండు చేతులలో హనుమంతుడు, అన్నపూర్ణ మాతా దేవాలయం నిర్మిస్తామన్నారు. మహర్షులు వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మునుల ఆలయాలను కూడా అయోధ్య ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తామని వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us