Viral Video: పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో పాపం.

సర్వేజనాః సుఖినో భవంతు అంటూ ప్రతి మనిషీ సుఖంగా, సంతోషంగా ఉండాలని దైవం తరపున ప్రజలను ఆశీర్వదించే పరమ పవిత్రమైన వ్యక్తి పురోహితుడు. ఒక్కమాటలో చెప్పాలంటే భగవంతునికీ భక్తునికీ అనుసంధానకర్త పురోహితుడు. ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా మొదట సంప్రదించేది పురోహితుడినే. రెండు జీవితాలకు వివాహ తంతుతో ముడి వేసి గృహస్థ జీవితానికి బాటలు వేసేది పురుహితుడే.

Viral Video: పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో పాపం.

|

Updated on: Apr 22, 2024 | 10:01 PM

సర్వేజనాః సుఖినో భవంతు అంటూ ప్రతి మనిషీ సుఖంగా, సంతోషంగా ఉండాలని దైవం తరపున ప్రజలను ఆశీర్వదించే పరమ పవిత్రమైన వ్యక్తి పురోహితుడు. ఒక్కమాటలో చెప్పాలంటే భగవంతునికీ భక్తునికీ అనుసంధానకర్త పురోహితుడు. ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా మొదట సంప్రదించేది పురోహితుడినే. రెండు జీవితాలకు వివాహ తంతుతో ముడి వేసి గృహస్థ జీవితానికి బాటలు వేసేది పురుహితుడే. అలాంటి పురోహితునికి తీవ్ర అవమానం జరిగింది. పెళ్లి జరిపించడానికి వచ్చిన పురోహితుడిపట్ల కొందరు ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడ్డారు.

పిఠాపురం మండలం మూలపేటలో ఏప్రిల్‌ 12న ఓ పెళ్లి జరిగింది. నాగమణి అనే మహిళ కుమారుడి వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి గ్రామానికి చెందిన పురోహితుడు ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ పిలిపించారు. వివాహ తంతు జరిపిస్తున్న సమయంలో కొంతమంది యువలకు పురోహితుడిపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు. పురోహితుడు శర్మ తలపై పసుపు, కుంకుమ, వాటర్‌ ప్యాకెట్లు చల్లడం, సంచి వేయడం, ఇతర సామగ్రి విసిరడం వంటివి చేశారు. ఆకతాయుల దుశ్చర్యను అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్‌ వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అది వైరల్‌ అయ్యింది. దీంతో ఈ ఘటనపై బ్రాహ్మణ, విశ్వహిందూ పరిషత్తు సంఘాల వారు తీవ్రంగా మండి పడుతున్నారు. ఇటీవల కొందరు వివాహ వేడుకల్లో సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు.. బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించి.. వివరాలు వాకబు చేశారు. కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడింది వాస్తవమే అని సూర్యనారాయణమూర్తి శర్మ తెలిపారు. వారు ఆ విధంగా ప్రవర్తించడం తనను బాధకు గురి చేసిందన్నారు. దీనిపై విశ్వహిందూ పరిషత్‌ సంఘాలు కల్పించుకున్నాయన్న ఆయన.. సోమవారం చర్చించుకుని తదుపరి తీసుకోబోయే చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక