Jupiters Stormy: గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.
మన సౌర మండలంలోనే అతిపెద్దదైన గురు గ్రహంపై పెను తుపాను ఏర్పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా విడుదల చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వాటిని పోస్ట్ చేస్తూ... సూర్యుడి నుంచి ఐదో గ్రహమైన జుపిటర్ పై ఏర్పడిన తుపానులు ఇవి.. ఇలా మొత్తం గ్రహాన్ని చుట్టుముట్టేశాయి. మన జునో మిషన్ ఈ ఫొటోలను తీసింది.
మన సౌర మండలంలోనే అతిపెద్దదైన గురు గ్రహంపై పెను తుపాను ఏర్పడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా విడుదల చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వాటిని పోస్ట్ చేస్తూ… సూర్యుడి నుంచి ఐదో గ్రహమైన జుపిటర్ పై ఏర్పడిన తుపానులు ఇవి.. ఇలా మొత్తం గ్రహాన్ని చుట్టుముట్టేశాయి. మన జునో మిషన్ ఈ ఫొటోలను తీసింది. గురుగ్రహంపై ఘన ప్రదేశం ఏదీ లేనందువల్ల ఇక్కడి తుపానులు కొన్నేళ్లు, దశాబ్దాలు లేదా కొన్ని వందల సంవత్సరాలు కొనసాగుతాయి. గంటకు 643 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయి అంటూ నాసా ఆ ఫొటోలకు క్యాప్షన్ జతచేసింది.
మరో క్యాప్షన్‌లో జుపిటర్ పై వీచే బలమైన గాలుల మధ్య నుంచి ఈ పెను తుపానును జునో ఫొటో తీసిందని, ఆ సమయంలో జునో గురు గ్రహంపై ఉండే భారీ వాయు మబ్బులకు 13,000 కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమిస్తోందని పేర్కొంది. ఇంకా అక్కడి పెను గాలుల్లో అమ్మోనియా, నీరు ఉంటాయని, హైడ్రోజన్, హీలియం ఎక్కువగా ఉండే గురుడి వాతావరణాన్ని ఈ గాలులు చుట్టేస్తుంటాయి అంటూ మరో క్యాప్షన్ జత చేసింది. నాసా షేర్ చేసిన ఫొటోల్లో నీలం, తెలుపు, మచ్చలతో కూడిన మబ్బులు, తుపానులు జుపిటర్ వాతావరణాన్ని చుట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన వెంటనే ఈ ఫొటోలను దాదాపు 3 లక్షల మంది లైక్ చేశారు. భారీ సంఖ్యలో నెటిజన్లు కామెంట్లు పోస్టు చేశారు. గురుగ్రహంపై అన్వేషణకు నాసా ప్రయోగించిన జునో స్పేస్ క్రాఫ్ట్ గతంలో ఆ గ్రహంపై గ్రేట్ రెడ్ స్పాట్ ఫొటోను 13,917 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసింది. భూమికి రెండింతల సైజులో ఉన్న ద గ్రేట్ రెడ్ స్పాట్ ఒక తుపాను. ఈ తుపాను గత 350 ఏళ్లుగా కొనసాగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

