Photo Puzzle: హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..

ఈ రోజుల్లో యువతపై సోషల్ మీడియా ప్రభావం చాలానే ఉంది. ఏజ్ గ్యాప్‌తో సంబంధం లేకుండా అందరూ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక వారికోసం టైంపాస్ కంటెంట్ నెట్టింట కోకొల్లలు. అయితే ఇటీవల ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఫోటో పజిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Photo Puzzle: హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
Photo Puzzle
Follow us

|

Updated on: Apr 23, 2024 | 6:40 PM

ఈ రోజుల్లో యువతపై సోషల్ మీడియా ప్రభావం చాలానే ఉంది. ఏజ్ గ్యాప్‌తో సంబంధం లేకుండా అందరూ కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక వారికోసం టైంపాస్ కంటెంట్ నెట్టింట కోకొల్లలు. అయితే ఇటీవల ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఫోటో పజిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిల్లోని చిక్కుముడిని విప్పేందుకు చాలామంది నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ పజిల్స్ మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు.. బద్దకంగా ఉన్న మిమ్మల్ని, మీ బుర్రను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. ‘ఈ ఫోటోలో పులిని గుర్తించండి చూద్దాం’, ‘ఈ ఫోటో పాము కనిపించిందా’, లాంటి ఫోటో పజిల్స్ మన మెదడుకు మేత వేస్తుంటాయి. వీటిని సాల్వ్ చేయడం టఫ్. మిమ్మల్నే ఉల్టా.. పల్టా.. చేసే ఈ పజిల్స్ సాల్వ్ చేయాలంటే దిమాక్‌లో దమ్ముండాల్సిందే..

తాజాగా ఈ కోవలోనే ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటో చూశారా.? ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయ్ కదూ..! అవునండీ.. అదొక అటవీ ప్రాంతం.. ఇక చెట్ల చిటారు కొమ్మల మాటున గుడ్లగూబ ఒకటి కోపంగా మిమ్మల్నే చూస్తోంది. మీలో దమ్ముందా.? నన్ను కనిపెట్టగలవా.? అని సవాల్ విసురుతోంది. మరి దాని సవాల్‌కు మీరు రెడీనేనా.? దీన్ని కనిపెట్టడం పెద్ద కష్టమేమి కాదండోయ్.. మీ చూపును పదును చేస్తే చాలు.. ఈ పజిల్‌ను నూటికి 50 శాతం మంది సాల్వ్ చేశారు. మరి మీరు కనిపెట్టండి. ఒకవేళ గుడ్లగూబ దొరక్కపోతే అప్పుడు ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి.

Photo Puzzle 1