Health Care Tips: ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తున్నారా.. జాగ్రత్త సుమా.. స్కిన్‌కు ప్రమాదం పొంచి ఉందట..
కొంతమంది వేసవిలో చాలాసార్లు స్నానం చేస్తారు. ఇలా చేయడం తమకు రిఫ్రెష్ అవుతుందని వారు భావిస్తున్నారు. అయితే ఇది వారికి హాని కలిగించవచ్చు. తరచుగా స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఎందుకంటే ఇలా తరచుగా స్నానం చేయడం వలన చర్మంలో ఉండే సహజ నూనెను తగ్గుతుంది. దీని కారణంగా చర్మం పొడిగా మారడం ప్రారంభమవుతుంది. అలాగే దీని కారణంగా అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.

వేసవి కాలం వచ్చిందంటే చాలు మండుతున్న ఎండలు, వడగాల్పులు ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారింది. తెల్లవారుజామునే స్నానం చేసి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టినా.. వేడి, చెమట కారణంగా, చికాకు అనుభూతిని చెందుతారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఇంటికి వెళ్లి మళ్లీ స్నానం చేయడానికి ఇష్టపడతారు. తద్వారా వారు రిఫ్రెష్ అవుతారు. చాలా మంది ప్రతిరోజూ ఏదైన పని మీద బయటకు వెళ్లినా.. మండే ఎండ నుంచి ఆఫీసు నుండి ఇంటికి చేరుకున్న తర్వాత స్నానం చేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు చెప్పిన విషయాలను తెలుసుకుందాం..
తీవ్రమైన వడగాల్పుల కారణంగా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని అలాంటి పరిస్థితుల్లో ఉక్కబోత కారణంగా ఇంటికి చేరుకోగానే హఠాత్తుగా స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుందని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి వైద్యుడు అంకిత్ కుమార్ చెబుతున్నారు. వేడి, చలి కారణంగా అనేక రకాల ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చు. ఇది గొంతు నొప్పి, జలుబు ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో ఇంటికి చేరుకున్న తర్వాత ముందుగా విశ్రాంతి తీసుకోవాలని.. కనీసం అరగంట పాటు హాయిగా కూర్చుని, తర్వాత స్నానం చేయాలని పేర్కొన్నారు.
కొంతమంది వేసవిలో చాలాసార్లు స్నానం చేస్తారు. ఇలా చేయడం తమకు రిఫ్రెష్ అవుతుందని వారు భావిస్తున్నారు. అయితే ఇది వారికి హాని కలిగించవచ్చు. తరచుగా స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఎందుకంటే ఇలా తరచుగా స్నానం చేయడం వలన చర్మంలో ఉండే సహజ నూనెను తగ్గుతుంది. దీని కారణంగా చర్మం పొడిగా మారడం ప్రారంభమవుతుంది. అలాగే దీని కారణంగా అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.
అందుకే వేసవిలో వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలని గుర్తుంచుకోండి. ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. తద్వారా శరీర ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రత లాగా లేదా రాత్రి నిద్రపోయే ముందు ఉంటుంది. అలాగే వేసవి కాలంలో ఎండ వేడిలో కొంతమంది ఇంటికి చేరుకుంటారు. ఈ పొరపాట్లకు దూరంగా ఉండాలి.
వేసవిలో ఇంటికి చేరుకున్న తర్వాత ఈ విషయాలను గుర్తుంచుకోండి.
వేడి ఎండ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చాలా దాహం వేస్తుంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది ప్రజలు చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం పొరపాటు. ఎందుకంటే బయటి నుంచి వచ్చిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా చల్లని నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలో మార్పు వచ్చి జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఏసీలో కూర్చోవద్దు
ఎండ వేడి, వడగాల్పులు నుంచి వచ్చిన తర్వాత AC గదిలో కూర్చోవద్దు. ఎందుకంటే AC నుంచి వచ్చే చల్లని గాలి వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే ఎక్కువ చల్లని ప్రదేశంలో ఉండడం వలన మీరు వేడి అనుభూతి చెందుతారు. దీని వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..