Multivitamin: మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే జరిగేది ఇదే..! అసలివి ఆరోగ్యానికి మంచివేనా?

నేటి కాలంలో మల్టీవిటమిన్స్ తీసుకునే ట్రెండ్ బాగా పెరిగింది. శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించేందుకు అనేక మంది వీటిని తీసుకుంటున్నారు. దీంతో వివిధ బ్రాండ్ల మల్టీవిటమిన్‌లకు మార్కెట్‌లో ఫుల్‌ డిమాండ్ పెరిగింది. వీటిని ట్యాబ్లెట్లు, పౌడర్, ఎనర్జీ డ్రింక్స్‌ రూపంలో మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్లు, ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం లోపం భర్తీ చేయవచ్చని భావిస్తుంటారు..

Multivitamin: మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే జరిగేది ఇదే..! అసలివి ఆరోగ్యానికి మంచివేనా?
Multivitamins
Follow us

|

Updated on: Apr 23, 2024 | 1:17 PM

నేటి కాలంలో మల్టీవిటమిన్స్ తీసుకునే ట్రెండ్ బాగా పెరిగింది. శరీరంలోని పోషకాల లోపాన్ని అధిగమించేందుకు అనేక మంది వీటిని తీసుకుంటున్నారు. దీంతో వివిధ బ్రాండ్ల మల్టీవిటమిన్‌లకు మార్కెట్‌లో ఫుల్‌ డిమాండ్ పెరిగింది. వీటిని ట్యాబ్లెట్లు, పౌడర్, ఎనర్జీ డ్రింక్స్‌ రూపంలో మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్లు, ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం లోపం భర్తీ చేయవచ్చని భావిస్తుంటారు. కానీ మల్టీవిటమిన్ల గురించి జరుగుతోన్న ఈ ప్రచారం వల్ల చాలామంది వైద్యులను సంప్రదించకుండానే వాటిని తీసుకోవడం మొదలుపెడుతున్నారు. ఇలా నెలలు, సంవత్సరాల తరబడి వీటిని తీసుకుంటున్నారు. డైట్ సప్లిమెంట్ల మార్కెట్ రూ.43,650 కోట్లకు చేరుకుందని IMARC గ్రూప్ తాజా నివేదిక వెల్లడిస్తోంది. 2028 నాటికి అది రూ.95,810 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. దీనికి కారణం పట్టణ ప్రాంతాల్లో మల్టీవిటమిన్ సప్లిమెంట్ల డిమాండ్ వేగంగా పెరగడమే.

నిజంగా మన ఆరోగ్యానికి మల్టీవిటమిన్ అవసరమా?

ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అజిత్ జైన్ మాట్లాడుతూ.. నేటి సోషల్ మీడియా, గూగుల్ కాలంలో ప్రతి ఒక్కరూ తమ వైద్యాం తామే చేసుకుంటున్నారు. శరీరంలో చిన్నపాటి సమస్య వచ్చిన వెంటనే గూగుల్‌లో వెతికి మందులు తెచ్చుకుని, వాడుతున్నారు. మల్టీవిటమిన్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. టీవీల్లో ప్రకటనలు చూసి వాటిని తీసుకునే ట్రెండ్ పెరిగింది. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మల్టీవిటమిన్లు తీసుకోవడం ద్వారా సమతుల్య ఆహారం తీసుకోవడం జరగదు. ఫలితంగా మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. నిజానికి ప్రత్యేకంగా శరీరానికి మల్టీవిటమిన్స్ అవసరం లేదు. శరీరంలో ఏ విటమిన్ లోపిస్తే ఆ విటమిన్ మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు శరీరంలో విటమిన్ D లేదా B12 లోపం ఉంటే, అది లభించే మెడిసిన్‌ మాత్రమే తీసుకోవాలి. అది కూడా వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే వాడాలి.

ఎందుకంటే మల్టీవిటమిన్లలో విటమిన్ ఎ, ఇ కూడా ఉంటాయి. ఈ విటమిన్ల లోపం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ అవసరం లేకపోయినా వాటిని అనేక మంది తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. విటమిన్ A అధిక మోతాదులో తీసుకుంటే వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. అలాగే విటమిన్‌ E అధిక మోతాదులో తీసుకుంటే రక్తపోటులో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదలకు కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

మల్టీవిటమిన్లు తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. పరీక్ష ద్వారా లోపం ఉన్న విటమిన్ కోసం మాత్రమే మెడిసిన్‌ తీసుకోవాలి. డాక్టర్ మన దేశంలో అనేక మందికి విటమిన్ డి, బి12 లోపం ఉండటం సాధారణం. ఈ విటమిన్లు లోపం ఉంటే డాక్టర్ సలహా ప్రకారం మందులు తీసుకోవాలి. అయితే వీటిని మూడు నెలల కంటే ఎక్కువ కాలం తీసుకోకూడదు. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. మెరుగైన ఆహారం కంటే మల్టీవిటమిన్లు గొప్పవేం కాదు. అందుకే పాలు, గుడ్లు, చేప, ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ వంటి పోషకాహారం తీసుకుంటే మల్టీవిటమిన్లు తీసుకోవలసిన అవసరం ఉండదని డాక్టర్ అజయ్ కుమార్ అంటున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?