- Telugu News Photo Gallery Doing these things daily will definitely sharpen your brain, check here is details in Telugu
Brain Health: ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!
శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో బ్రెయిన్ కూడా ఒకటి. బ్రెయిన్ సరిగ్గా ఉంటేనే.. శరీరంలో ఏ అవయం అయినా ఆరోగ్యంగా పనులు నిర్వర్తిస్తుంది. శరీరం మొత్తం మెదడు ఆధీనంలోనే ఉంటుంది. సరైన ఆహారాలు తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. బ్రెయిన్ యాక్టీవ్‌గా, ఆరోగ్యంగా, షార్ప్‌గా పని చేయాలంటే.. ఏలాంటి పనులు చేయాలో ఇప్పుడు చూద్దాం. బ్రెయిన్‌కి ఎప్పుడూ తగినంత రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడున్న టెక్నాలజీ కారణంగా చాలా మంది ఫోన్‌లకు, టీవీలకు, ల్యాప్ ట్యాప్‌లకు..
Updated on: Apr 23, 2024 | 4:02 PM

శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో బ్రెయిన్ కూడా ఒకటి. బ్రెయిన్ సరిగ్గా ఉంటేనే.. శరీరంలో ఏ అవయం అయినా ఆరోగ్యంగా పనులు నిర్వర్తిస్తుంది. శరీరం మొత్తం మెదడు ఆధీనంలోనే ఉంటుంది. సరైన ఆహారాలు తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. బ్రెయిన్ యాక్టీవ్‌గా, ఆరోగ్యంగా, షార్ప్‌గా పని చేయాలంటే.. ఏలాంటి పనులు చేయాలో ఇప్పుడు చూద్దాం.

బ్రెయిన్‌కి ఎప్పుడూ తగినంత రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడున్న టెక్నాలజీ కారణంగా చాలా మంది ఫోన్‌లకు, టీవీలకు, ల్యాప్ ట్యాప్‌లకు అతుక్కు పోతున్నారు. దీని వల్ల మెదడుపై ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది.

ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపడం, ప్రకృతిని ఆస్వాదించడం వంటివి చేస్తూ ఉండాలి. దీని వల్ల మెదడు హాయిగా ఉంటుంది. అలాగే యోగా, వ్యాయామాలు వంటివి చేస్తూ ఉండాలి. దీని వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవ్వడంతో పాటు.. అభిజ్ఞా పనితీరు కూడా చక్కగా ఉంటుంది.

బ్రెయిన్ యాక్టీవ్‌గా, హెల్దీగా ఉండాలంటే.. యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్, పండ్లు, కూరగాయలు, నట్స్, లీన్ ప్రోటీన్ వంటివి చాలా సహాయ పడతాయి. అదే విధంగా ఏడు నుంచి 9 గంటల పాటు నిద్ర కూడా చాలా అవసరం.

మెదడు ఆరోగ్యం మెరుగు పడాలంటే.. పుస్తకాలు కూడా చదువుతూ ఉండాలి. ఇది మెదడుకు ఒక రకమైన వ్యాయామం. దీని వల్ల జ్ఞానం కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మెదడుకు గాయం కాకుండా చూసుకోవాలి. ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది.





























