- Telugu News Photo Gallery If bad cholesterol is high in the body, there will be pain in these parts, check here is details
High Cholesterol Signs: శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!
ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కూడా ఒకటి. మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పేరుకు పోతుంది. చెడు కొలెస్ట్రాల్ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. హార్ట్ ఎటాక్, రక్త పోటు, డయాబెటీస్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి వ్యాధులు ఎక్కువగా ఎటాక్ చేస్తున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కనుక్కోవాలంటే..
Updated on: Apr 23, 2024 | 4:26 PM

ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం కూడా ఒకటి. మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పేరుకు పోతుంది. చెడు కొలెస్ట్రాల్ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొనాల్సి వస్తుంది.

హార్ట్ ఎటాక్, రక్త పోటు, డయాబెటీస్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి వ్యాధులు ఎక్కువగా ఎటాక్ చేస్తున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కనుక్కోవాలంటే.. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు కనుక్కోవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.. కొన్ని భాగాల్లో నొప్పి వస్తుంది.

బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోతే.. కాళ్లు, పాదాల్లో తీవ్రమైన నొప్పిగా ఉంటుంది. కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. కాళ్ల గోర్ల రంగు కూడా మారుతుంది. అంతే కాకుండా కాలి వేళల్లో స్వెల్లింగ్ ఉంటుంది. కాళ్లు అనేవి చాలా వీక్‌గా మారిపోయితా. కాళ్ల చర్మం రంగు కూడా మారిపోతుంది.

అలాగే చెడు కొలెస్ట్రాల్ అనేది బాగా పెరిగినప్పుడు, తొడలు, హిప్స్, కాఫ్ మజిల్స్‌లో తీవ్రమైన నొప్పిగా ఉంటుంది. ధమనుల్లో బ్లాకేజ్ కారణంగా.. శరీర అవయవాలకు రక్తం సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండక.. ఈ భాగాల్లో నొప్పులు వస్తాయి.

అదే విధంగా.. రక్తంలో బాగా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనుల్లో బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. ఫలితంగా రక్తం గుండె వరకూ చేర్చడంలో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో బీపీ పెరిగి.. గుండె నొప్పికి కూడా కారణం అవుతుంది. అందుకే ఈ పరిస్థితి తలెత్తకుండా కొలెస్ట్రాల్ నియంత్రించాల్సి ఉంటుంది.





























