- Telugu News Photo Gallery Technology photos These are the top brand refrigerators under Rs 15,000, check details in telugu
Refrigerators: చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేల కన్నా తక్కువే..
నేడు ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ తప్పనిసరి. ఈ వేసవిలో అది లేకుండా ఉండలేం. మన కనీస అవసరంగా మారిన రిఫ్రిజిరేటర్లు అనేక మోడళ్లలో వివిధ ఫీచర్లతో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సింగిల్ డోర్, డబుల్ డోర్, ఫోర్ డోర్ వరకూ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చిన్న కుటుంబాలకు సరిపడే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు అతి తక్కువ ధరకు అంటే రూ.15 వేల లోపు లభిస్తున్నాయి. నాణ్యమైన కూలింగ్ టెక్నాలజీ, మెరుగైన పనితీరు, విశాలమైన స్టోరేజీతో ఆకట్టుకుంటున్నాయి. పేదలకు అందుబాటు ధరలో ఉండడంతో పాటు అత్యుత్తమ ఫీచర్లు కలిగి ఉండడం వీటి ప్రత్యేకత. ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న సామ్సంగ్, వర్ల్ పూల్, గోద్రెజ్, హైయర్ తదితర కంపెనీల రిఫ్రిరేటర్ల గురించి వివరాలు తెలుసుకుందాం.
Madhu |
Updated on: Apr 23, 2024 | 4:37 PM

శామ్సంగ్ 183ఎల్ 2 స్టార్ డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్(Samsung 183 L 2 Star Direct Cool Single Door Refrigerator).. గ్రే సిల్వర్ డిజైన్, సమర్థవంతమైన కూలింగ్ టెక్నాలజీ, 2 స్టార్ రేటింగ్ తో ఈ రిఫ్రిజిరేటర్ ఆకట్టుకుంటుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో పాటు దీర్ఘకాల పనితీరు దీని ప్రత్యేకత. దీని లోపలి భాగంలో గట్టి గాజు అల్మారాలు, కూరగాయల బాక్స్, ప్రత్యేక డెయిరీ కంపార్ట్‌మెంట్ ఉన్నాయి. స్టెబిలైజర్ రహిత ఆపరేషన్, 15 రోజుల వరకు తాజాదనం వంటి ప్రత్యేక లక్షణాలతో ఈ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలుదారుల విశ్వనీయతను పొందింది. ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ 165 లీటర్లు, ఫ్రీజర్ కెపాసిటీ 18 లీటర్లు, వార్షిక విద్యుత్ వినియోగం 188 కేడబ్ల్యూహెచ్, టఫెన్డ్ గ్లాస్ షెల్ఫ్‌లు, క్లియర్ వ్యూ ల్యాంప్, డీప్ డోర్ గార్డ్ ఇతర పత్యేకతలు. ప్రాజెక్ట్ పై ఏడాది, డిజిటల్ ఇన్వెర్టర్ కంప్రెసర్ పై 20 ఏళ్ల వారంటీ ఉంది. ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ.14,190గా ఉంది.

హైయర్ 165ఎల్ 1 స్టార్ రిఫ్రిజిరేటర్(Haier 165 L 1 star direct cool single door refrigerator).. చిన్నకుటుంబాలకు ఈ రిఫ్రిజిరేటర్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. 15 లీటర్ల ఫ్రీజర్, 150 లీటర్ల ఫ్రెష్ ఫుడ్ కంపార్ట్‌మెంట్‌తో సహా 165 లీటర్ల సామర్థ్యంతో కలిగి ఉంది. వన్ స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉన్నప్పటికీ దీని కంప్రెసర్ పై పదేళ్ల వారంటీ ఉంది. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్, డైమండ్ ఎడ్జ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. కూరగాయలు నిల్వ చేసుకునేందుకు బాక్స్,బాటిల్ గార్డ్ ఏర్పాటు బాగున్నాయి. దీని వార్షిక శక్తి వినియోగం 215 కిలోవాట్ గంటలు. ఎల్ ఈడీ ల్యాంప్, అనుకూలమైన హ్యాండిల్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రాడెక్ట్ పై ఏడాది, కంప్రెసర్‌పై పదేళ్ల వారంటీ ఉంది. ఈ రిఫ్రిజిరేటర్ ధర రూ.10,990.

గోద్రెజ్ 180ఎల్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్(Godrej 180 L 4-Star Turbo Cooling Single Door Refrigerator).. తక్కువ ధరలో లభించే ఈ స్టైలిష్ రిఫ్రిజిరేటర్ ఫోర్ స్టార్ రేటింగ్ తో 180 లీటర్ల సామర్థ్యంతో అందుబాటులో ఉంది. లోపలి విశాలమైన ఖాళీ ప్రదేశంలో వివిధ పదార్థాలను స్టోర్ చేసుకోవచ్చు. దీని కంప్రెసర్ పై పదేళ్ల వారంటీ లభిస్తుంది. 150 కిలోల బరువును తట్టుకునే టఫ్‌నెడ్ గ్లాస్ షెల్ఫ్ ఉపయోగంగా ఉంటుంది. దీని జంబో వెజిటబుల్ ట్రేలో కూరగాయలు తాజాగా ఉంటాయి. పెద్ద బాటిళ్లను సులభంగా స్టోర్ చేయవచ్చు. టర్బో కూలింగ్ టెక్నాలజీ కలిగిన ఈ రిఫ్రిజిరేటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ 163.5 లీటర్లు, ఫ్రీజర్ కెపాసిటీ 16.5 లీటర్లు, వార్షిక శక్తి వినియోగం 149 కిలోవాట్ గంటలు. ప్రాడెక్ట్ పై ఏడాది, కంప్రెసర్‌పై పదేళ్ల వారంటీ ఇస్తున్నారు. దీని ధర రూ.14590.

వర్ల్ పూల్ 184లీటర్ల 3 స్టార్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్(Whirlpool 184 L 3 Star Direct Cool Single Door Refrigerator).. ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులుండే కుటుంబాలకు ఈ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఉపయోగపడుతుంది. స్టెబిలైజర్ రహిత ఆపరేషన్, ఇంటెల్లిసెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీతో పనితీరు మెరుగ్గా ఉంటుంది. విద్యుత్ కోత సమయంలో దాదాపు 9 గంటల పాటు కూలింగ్ ఉండడం దీని ప్రత్యేక లక్షణం. పెద్ద నిల్వ సామర్థ్యంతో మీ రోజువారీ అవసరాలకు బాగుంటుంది. దీనిలో ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ 169.3 లీటర్లు, ఫ్రీజర్ కెపాసిటీ 14.3 లీటర్లు, వార్షిక శక్తి వినియోగం 170 కిలోవాట్లు. ఇక ప్రత్యేకతల్లోకి వెళితే హనీ కాంబ్ లాక్ ఇన్ టెక్నాలజీ, ఇంటెల్లిసెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీ, యాంటీ బాక్టీరియల్ గాస్కెట్, ఆటో కనెక్ట్ హోమ్ ఇన్వర్టర్ ఉన్నాయి. ప్రాడెక్ట్ పై ఏడాది, కంప్రెసర్‌పై పదేళ్ల వారంటీ ఉంది. దీని ధర రూ.14,040.

శామ్సంగ్ 183 ఎల్ 3 స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజరేటర్(Samsung 183 L 3-Star Digital Inverter Refrigerator).. ఇది త్రీస్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. దీనిలోని డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ 50 శాతం తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. దీర్ఘకాల పనితీరును అందిస్తుంది. సోలార్ ప్యానెల్ సపోర్ట్, సేఫ్ క్లీన్ బ్యాక్ వంటి వినూత్న సాంకేతికతతో కూలింగ్ వ్యవస్థ చాలా బాగుంటుంది. దీనిలో ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ 165 లీటర్లు, ఫ్రీజర్ కెపాసిటీ 18 లీటర్లు, వార్షిక శక్తి వినియోగం 168 కిలోవాట్ గంటలు. అలాగే యాంటీ బాక్టీరియల్ రబ్బరు పట్టీ, స్టెబిలైజర్ లేని ఆపరేషన్, క్లియర్ వ్యూ ల్యాంప్, డెప్ డోర్ గార్డ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రాడెక్ట్ పై ఏడాది, డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌పై 20 ఏళ్ల వారంటీ ఉంది. ఈ రిఫ్రిజిరేటర్ రూ.14,980కు అందుబాటులో ఉంది.





























