AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Safety Tips for Kids: మండే ఎండల్లో పిల్లల ఆరోగ్యం పదిలం.. ఈ చిట్కాలు పాటిస్తే సమ్మర్‌ ఎఫెక్ట్‌ లేనట్లే!

ఈ సంవత్సరం ఎండలు బాగానే మండుతున్నాయి. రానున్న రోజుల్లో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు ఎండల్లో బయటకు వెళ్లేవారు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా.. రానున్న రోజుల్లో మరింత ఎండ వేడి పెరిగే ప్రమాదం ఉంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో..

Summer Safety Tips for Kids: మండే ఎండల్లో పిల్లల ఆరోగ్యం పదిలం.. ఈ చిట్కాలు పాటిస్తే సమ్మర్‌ ఎఫెక్ట్‌ లేనట్లే!
Summer Safety Tips For Kids
Yellender Reddy Ramasagram
| Edited By: Srilakshmi C|

Updated on: Apr 23, 2024 | 12:57 PM

Share

ఈ సంవత్సరం ఎండలు బాగానే మండుతున్నాయి. రానున్న రోజుల్లో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు ఎండల్లో బయటకు వెళ్లేవారు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా.. రానున్న రోజుల్లో మరింత ఎండ వేడి పెరిగే ప్రమాదం ఉంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తుంటారు. అలాంటప్పుడు పిల్లలు ఎండ తీవ్రతకు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మామూలుగా నలభై డిగ్రీలు ఆపై ఉష్ణోగ్రతలు వల్ల వడగలు వస్తుంటాయి. దీనివల్ల శరీరంపై ఉన్న స్వేద రంద్రాలు మూసుకుపోయి శరీరంలోని వేడి చెమట బయటకి రాకుండా ఉండిపోతాయి. దీంతో శరీరంలో వేడి తీవ్రమై మనిషి అస్వస్థతకు గురి కావ్వడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అవసరమని వైద్యులు చెప్తున్నారు. అయితే చిన్నపిల్లల్లో ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

ఐదేళ్ల లోపు చిన్నారులు చాలా సున్నితంగా ఉంటారు. తీవ్రమైన సూర్యరశ్మిని వారు తట్టుకోలేరు. ఎండలో చిన్న పిల్లలను బయట తిప్పడం వల్ల డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో వాంతులు, విరోచనాలు ఏర్పడి వెంటనే డిహైడ్రేషన్ కి గురవుతారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పే. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి తీసుకెళ్లడం బెటర్. ముఖ్యంగా పిల్లలకు కాటన్ బట్టలు వేయడం, బయటికి వెళ్ళనీయకుండా చూడడం, పిల్లలు ఉండే గదులు చల్లగా ఉండేలా చూసుకోవడం మంచిదంటున్నారు.

ఇవి కూడా చదవండి

నాలుగేళ్లలోపు పిల్లలకు సమ్మర్ లో ప్రతిరోజు 1 నుండి 1.5 లీటర్ల వరకు నీరు తాగించాలి. నాలుగు నుంచి తొమ్మిది యేళ్ల పిల్లలకు 1.5 నుండి 2 లీటర్ల నీరు తాగించాలి. పండ్ల రసాలతో డిహైడ్రేషన్ తీరదు. కనుక పిల్లలు హైడ్రేట్ కావడానికి కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటి ద్రవపదార్థాలు రెగ్యులర్‌గా ఇవ్వాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళనివ్వకుండా ఇండోర్ గేమ్స్ ఆడిస్తూ.. ఆ ప్రాంతం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా పిల్లలను అవి తగ్గేంత వరకూ స్విమ్మింగ్‌కు పంపకూడదు. పిల్లలకు ఉదయం తొమ్మిదిలోపు సాయంత్రం ఆరు తర్వాత మాత్రమే స్నానం చేయించాలి. పసిపిల్లలకు అధికంగా తల్లిపాలు ఇచ్చే విధంగా చూడాలి. రబ్బరు డైపర్ వాడకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!