Depression: మనసుకూ మందు కావాలి.. మీలోనూ ఈ లక్షణాలు కన్పిస్తే ఆలస్యం చేయకండి!
మనసు అలిసిపోయిందా ..? మనసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారా ? నిరాశ నిస్సహాయత మిమ్మల్ని చుట్టుముట్టాయా? ఇలాంటి కారణాలతో జీవితం మీద విరక్తి కలుగుతుందా? అయితే ఓపెన్ అవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే ఆత్మహత్య వరకు కూడా దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గుండె ఉన్న వాళ్లకు గుండె సమస్యలు ఎంత సహజమో మనసు ఉన్న ప్రతి ఒక్కరికి..

మనసు అలిసిపోయిందా ..? మనసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారా ? నిరాశ నిస్సహాయత మిమ్మల్ని చుట్టుముట్టాయా? ఇలాంటి కారణాలతో జీవితం మీద విరక్తి కలుగుతుందా? అయితే ఓపెన్ అవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే ఆత్మహత్య వరకు కూడా దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గుండె ఉన్న వాళ్లకు గుండె సమస్యలు ఎంత సహజమో మనసు ఉన్న ప్రతి ఒక్కరికి మానసిక సమస్యలు అంతే సహజం అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి అలసిన మనసు సేద తీరడం కోసం మనసు విప్పి మాట్లాడాలని సూచిస్తున్నారు.
చేసే పని మీద ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత లేకపోవడం, జీవితం బోర్ గా అనిపించడం, మనసులోని బాధలు ఎవరితో పంచుకోవడానికి వెనకాడడం, చేద్దామని మొదలుపెట్టిన పనిని మధ్యలోనే వదిలేయడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం, కలాజికల్ గా లోన్లీనెస్ కి గురికావడం.. చివరికి చనిపోవడమే పరిష్కారం అనే ఆలోచన కలగడం వాటి నుండి బయట పడాలంటే కొన్ని సూచనలు ఫాలో అవ్వాలని అంటున్నారు నిపుణులు. డిప్రెషన్‌కి గురై మనసులోని బాధను వెల్లబోసుకుందామనుకునే వ్యక్తులు.. ఆత్మ న్యూనతకు లోనవరు. కానీ బాధను బయటపెట్టే క్రమంలో వారి మాటలను కొట్టి పారేయకూడదు. డిప్రెషన్‌ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయంగానో.. పని లేని వాళ్ళు అవసరానికి మించి ఆలోచించి తెచ్చుకునే సమస్యగానో తేలికగా కొట్టిపారేసేలా మాట్లాడకూడదు.
ఎవరైనా వ్యక్తి ఇటీవల కాలంలో అనుకోని ఒత్తిడికి, బాధకు, ఊహించని పరిణామానికి లోనయ్యారేమో గమనించాలి. హుషారు తగ్గిన, ఆసక్తి లోపించిన, మాటల్లో ప్రవర్తనలో తేడా కనిపించిన, చనిపోతానని పదేపదే అంటున్న , ఉద్యోగానికి , కాలేజీకి వెళ్లకపోతున్న, గదిలో ఒంటరిగా ఉండిపోతూ, ఎక్కువగా మొబైల్ ఫోన్తో గడుపుతూ ఉన్నా.. వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి వారు డిప్రెషన్ నుంచి బయటపడాలంటే.. ఏదైనా ఒక అలవాటును ఏర్పరచుకోవడం, నచ్చిన పని చేయడం, సోషల్ గ్రూప్స్ ఏర్పరచుకోవడం, బుక్ ఫ్రెండ్స్, పెన్ ఫ్రెండ్స్‌ని పెంచుకోవాడం వంటివి చేయాలి. అలాగే అభిప్రాయాలు, భావాలను సన్నిహితులతో పంచుకుంటూ ఉండాలి. పరిస్థితుల ప్రభావంతో వచ్చేదే ఒంటరితనం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. డిప్రెషన్ లక్షణాలు కనిపించినప్పుడు మొట్టమొదటిగా చేయవలసిన పని మన చుట్టూ ఉన్న వారితో ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ ఉండటం. ఇలా చేస్తూ మన ఆలోచన ధోరణిని మార్చుకోవడం అత్యంత ప్రధానం అని నిపుణుల సూచన.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.