Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangoes: మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?

వేసవిలో ఎండ ఇబ్బందికి గురిచేసినా మామిడి పండ్లు లభిస్తాయన్న అంశం సంతోషాన్ని కలిగిస్తుంది. మామిడి పండ్ల రుచి అలాంటిది మరి. కేవలం మామిడి కోసమే వేసవి రావాలని చూసే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే మామిడి పండు తీసుకునే విషయంలో కొన్ని పద్ధతులను పాటిస్తుంటారు. ముఖ్యంగా మామిడి పండ్లను...

Mangoes: మామిడి పండ్లను తినే ముందు ఎందుకు నానబెట్టాలో తెలుసా.?
Mangoes
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 23, 2024 | 12:13 PM

వేసవిలో ఎండ ఇబ్బందికి గురిచేసినా మామిడి పండ్లు లభిస్తాయన్న అంశం సంతోషాన్ని కలిగిస్తుంది. మామిడి పండ్ల రుచి అలాంటిది మరి. కేవలం మామిడి కోసమే వేసవి రావాలని చూసే వారు మనలో చాలా మంది ఉంటారు. అయితే మామిడి పండు తీసుకునే విషయంలో కొన్ని పద్ధతులను పాటిస్తుంటారు. ముఖ్యంగా మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టి తీసుకోవడం అందరికీ తెలిసిందే. అయితే మామిడి పండ్లను నీటిలో నానబెట్టి తీసుకోవడం వెనకాల అసలు కారణం ఏంటి..? దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మామిడిలో ఫైటోకెమికల్స్‌, బయోయాక్టివ్‌ సమ్మేళనాలు కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు సంబంధిత జన్యువులపై ప్రభావం చూపుతాయి. అయితే మామిడి పండ్లను నీటిలో నానబెడితే ఈ సమ్మేళనాల గాఢత తగ్గి, శరీరానికి హానికరమైన కొవ్వుని కరిగించడంలో ఉపయోగపడతాయి. అందుకే మామిడి పండ్లను తీసుకునే ముందు నీటిలో నానబెడతారు. బరువు కంట్రోల్‌లో ఉండాలనుకునే వారు ఇలా చేయాలి.

* మామిడి పండ్లు వేడి చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రుచిగా ఉంటాయని మొతాదుకు మించి తీసుకుంటే మొటిమలు కావడం శరీరంలో వేడి చేయడం వంటి సమస్యలు తప్పవు. అందుకే మామిడి పండ్లను నీటిలో కాసేపు నానబెట్టి తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి చేసే గుణాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఇక మామిడిలో ఎన్నో మంచి పోషకాలు ఉంటాయి. ఇందులోని విటమిన్లు, పోలేట్‌లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ లాభాలన్నీ చేకూరాలంటే మాత్రం కచ్చితంగా మామిడి పండ్లను నీటిలో నానబెట్టి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లను తీసుకునే కనీసం 1 నుంచి 2 గంటల వరకు నానబెట్టాలని చెబుతున్నారు.

* ఇక ఇటీవల మామిడి పండ్లు త్వరగా పండించాలని చాలా మంది కెమికల్స్‌ జల్లుతున్నారు. ఇలాంటి కెమికల్స్‌ పండు తొక్కపై చేరతాయి. సరిగ్గా కడుక్కోకుండా పండ్లను తింటే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒక గంటపాటు నీటిలో నానబెడితే రసాయనాలన్నీ తొలగిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..