Lifestyle: కాబోయే అమ్మలూ.. మీకు తెలివైన పిల్లలు పుట్టాలని ఉందా.?
మంచి సంతానానికి జన్మనివ్వాలనేది ప్రతీ ఒక్కరి కోరిక. కాబోయే తల్లులు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తాము జన్మనివ్వబోతున్న చిన్నారి ఎలా ఉండనుంది.? అనే ఆలోచనలతో మురిసిపోతుంటారు. ఇక ఎవరైనా మంచి తెలివితేటలతో ఉన్న చిన్నారి జన్మించాలని భావిస్తుంటారు. మరి పుట్టబోయే చిన్నారులు తెలివితేటలతో...

మంచి సంతానానికి జన్మనివ్వాలనేది ప్రతీ ఒక్కరి కోరిక. కాబోయే తల్లులు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తాము జన్మనివ్వబోతున్న చిన్నారి ఎలా ఉండనుంది.? అనే ఆలోచనలతో మురిసిపోతుంటారు. ఇక ఎవరైనా మంచి తెలివితేటలతో ఉన్న చిన్నారి జన్మించాలని భావిస్తుంటారు. మరి పుట్టబోయే చిన్నారులు తెలివితేటలతో జన్మించాలంటే గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.? ఎలాంటి జీవన విధానాన్ని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* పుట్టబోయే పిల్లల మెదడు షార్ప్‌గా ఉండాలంటే గర్భిణీలు విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉడికించిన గుడ్డు, చేపలు, మీట్, తృణధాన్యాలు, పాలకూర వంటి వాటిని క్రమంతప్పకుండా తీసుకోవాలి. అలాగే ఉదయం కాసేపు సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి.
* ఇక బాదం పప్పు, వాల్ నట్స్, పిస్తా పప్పు, జీడి పప్పు వంటివి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వాల్‌నట్స్‌లో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాగే ఇందులోని పోషకాలు శిశువు మెదడు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతాయి.
* ఇక గర్భిణీలు కచ్చితంగా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్, బీట్‌రూట్, టమాటా, పప్పు ధాన్యాలు, అరటి పండ్లు, వేరు శెనగలు, రొయ్యలను డైట్‌లో భాగం చేసుకుంటే పుట్టబోయే పిల్లల్లో మెదడు మెరుగ్గా పనిచేస్తుంది.
* ఇక ఐరన్ కంటెంట్ ఉండే ఆహారాన్ని కూడా డైట్‌లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం దానిమ్మ రసం, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, బీన్స్, ఓట్స్ వంటి వాటితో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
* గర్భిణీలు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. కనీసం రోజులో 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
* ఇక గర్భిణీలు వీలైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతందని అంటున్నారు. కాబట్టి యోగా, మెడిటేషన్ వంటి వాటిని కచ్చితంగా జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..