Lifestyle: ఉదయమా, సాయంత్రమా.? వాకింగ్ ఎప్పుడు చేస్తే మంచిది..

ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. వాకింగ్‌తో ఎన్నో రకాల లాభాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా వరకు వ్యాధులకు వాకింగ్‌తో చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా ఊబకాయం, హృదయ సంబంధిత వ్యాధులు, డయాబెటిస్‌ వంటివి దరిచేరకుండా చూడడంలో వాకింగ్ ఎంతో క్రీయాశీలకంగా ఉపయోపగుడుతంది. భారతీయుల్లో...

Lifestyle: ఉదయమా, సాయంత్రమా.? వాకింగ్ ఎప్పుడు చేస్తే మంచిది..
Walking
Follow us

|

Updated on: Apr 23, 2024 | 7:04 AM

ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. వాకింగ్‌తో ఎన్నో రకాల లాభాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా వరకు వ్యాధులకు వాకింగ్‌తో చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా ఊబకాయం, హృదయ సంబంధిత వ్యాధులు, డయాబెటిస్‌ వంటివి దరిచేరకుండా చూడడంలో వాకింగ్ ఎంతో క్రీయాశీలకంగా ఉపయోపగుడుతంది. భారతీయుల్లో హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాల్లో వాకింగ్ చేయకపోవడం ఒకటని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెల్లడయ్యాయి.

ఇదిలా ఉంటే మనలో కొందరు ఉదయం వాకింగ్ చేస్తే మరికొందరు సాయంత్రం చేస్తుంటారు. అయితే ఉదయం సాయంత్రం చేయడం మంచిదా.? సాయంత్రం వాకింగ్ చేయడం మంచిదా అనే అనుమానం సహజంగానే వస్తుంది. ఈ విషయాన్ని తేల్చేందుకే పరిశోధకులు ఓ అధ్యయాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ ఈ విషయపై ఓ అధ్యయాన్ని నిర్వహించగా ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా 40 ఏళ్లు దాటిని 30 వేల మందిని ఎనిమిదేళ్ల పాటు పరిశీలించారు.

ఊబకాయం, మధుమేహం ఉన్న వారు సాయంత్రం వాకింగ్‌ చేస్తే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. వీరిలో అకాల మరణం, గుండెజబ్బుల ముప్పు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనంలో తేలింది. స్మార్ట్‌వాచ్‌ వంటి గ్యాడ్జెట్‌ ఆధారంగా ఎంతసేపు వాకింగ్‌ చేస్తున్నారన్న విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. గుండె, శ్వాస వేగాన్ని పెంచే ఏరోబిక్‌ వ్యాయామాలతో మంచి ఫలితం కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వేగంగా పరిగెత్తడం, నడవం వంటి వాటితో మంచి ఫలితాలు ఉన్నట్లు గమనించారు.

రక్తంల గ్లూకోజ్‌ స్థాయిలు ఎక్కువగా ఉన్న వారు సాయంత్రం వాకింగ్‌ లేదా వ్యాయామం చేయడం వద్ద భవిష్యత్తులో వచ్చే కొన్ని ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వాకింగ్‌తో ఊబకాయం ఒక్కటే కాదని, దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను సైతం తగ్గించుకోవచ్చని పరిశోధనల్లో వెల్లడైంది.

నోట్: పైన తెలిపిన వివరాలు కేలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?