వేసవిలో ఆధ్యాత్మిక పర్యటన చేయాలనుకుంటున్నారా.. తక్కువ ధరకే మధ్యప్రదేశ్ IRCTC టూర్ ప్యాకేజీ..

వేసవిలో సెలవులు వచ్చేశాయి. దీంతో కొంతమంది ప్రకృతి అందాలను కనువిందు చేసే ప్రాంతాలను చూడాలని కోరుకుంటే.. మరికొందరు ఆధ్యాత్మిక ప్రదేశాలను పర్యటించాలని కోరుకుంటారు. జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలని భావిస్తే హైదరాబాద్ నుంచి ఉజ్జయిని జ్యోతిలింగ క్షేత్ర దర్శనం కోసం ఐఆర్‌టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ప్రతి బుధవారం కాచిగూడ నుంచి ఈ టూర్ ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ లో భాగంగా మధ్యప్రదేశలోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని మొదలైన ప్రాంతాలను దర్శించుకోవచ్చు.

వేసవిలో ఆధ్యాత్మిక పర్యటన చేయాలనుకుంటున్నారా.. తక్కువ ధరకే మధ్యప్రదేశ్ IRCTC టూర్ ప్యాకేజీ..
Irctc Hyderabad To Mp Tour
Follow us

|

Updated on: Apr 22, 2024 | 9:16 PM

వేసవిలో సెలవులు వచ్చేశాయి. దీంతో కొంతమంది ప్రకృతి అందాలను కనువిందు చేసే ప్రాంతాలను చూడాలని కోరుకుంటే.. మరికొందరు ఆధ్యాత్మిక ప్రదేశాలను పర్యటించాలని కోరుకుంటారు. జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలని భావిస్తే హైదరాబాద్ నుంచి ఉజ్జయిని జ్యోతిలింగ క్షేత్ర దర్శనం కోసం ఐఆర్‌టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ప్రతి బుధవారం కాచిగూడ నుంచి ఈ టూర్ ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ లో భాగంగా మధ్యప్రదేశలోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని మొదలైన ప్రాంతాలను దర్శించుకోవచ్చు.

ఉజ్జయిని క్షేత్ర టూర్ వివరాలు

టూర్ లో మొదటి రోజు: ప్రతి బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌(రైలు నం. 12707)లో సాయంత్రం 4.40 గంటలకు స్టార్ట్ అవుతారు. రాత్రి అంతా ప్రయాణిస్తారు.

ఇవి కూడా చదవండి

రెండో రోజు: మర్నాడు గురువారం ఉదయం 08:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ  నుంచి హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది. ఫ్రెషప్ అయిన అనంతరం పురాతన సాంచి స్థూపాన్ని సందర్శించడానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నుంచి భోజేశ్వర్ మహాదేవ్ ఆలయం, గిరిజన మ్యూజియాన్ని సందర్శించ వచ్చు. రాత్రికి భోపాల్‌లో హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది.

టూర్ లో మూడో రోజు: మూడో రోజు శుక్రవారం ఉదయం హోటల్‌లో టిఫిన్ చేసి చెక్ అవుట్ అయి ఉజ్జయినికి స్టార్ట్ అవుతారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అయ్యి స్థానిక దేవాలయాలైన మహాకాళేశ్వర ఆలయం, హరసిద్ధి ఆలయం, మంగళనాథ్ ఆలయం, నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయం వంటివి సందర్శించాల్సి ఉంటుంది. రాత్రికి ఉజ్జయినిలో బస చేయాల్సి ఉంటుంది.

టూర్ లో నాల్గో రోజు: శనివారం ఉదయం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి చెక్ అవుట్ అయ్యి మహేశ్వర్ కు బయలుదేరాల్సి ఉంది. అహల్యా దేవి కోట , నర్మదా ఘాట్ ను సందర్శించి ఓంకారేశ్వర్‌కు బయలుదేరాల్సి ఉంటుంది. హోటల్ లో బస చేసి అనంతరం ఓం కారేశ్వర్ ఆలయానికి వెళ్ళాలి. రాత్రికి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

టూర్ లో ఐదు రోజు: ఆదివారం ఉదయం హోటల్‌లో టిఫిన్ చేసి ఇండోర్‌కి వెళ్తారు. అక్కడ లాల్ బాగ్ ప్యాలెస్, ఖజ్రానా గణేష్ ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి 8:00 గంటలకు ఇండోర్ రైల్వే స్టేషన్‌కి చేరుకొని రైలు నెం. 19301 రైలు ఎక్కి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

ఆరో రాజు జర్నీ: ఆరో రోజు సోమవారం ఉదయం అంతా ప్రయాణం చేసి సోమవారం రాత్రి 10:00 గంటలకు కాచిగూడ చేరుకుంటారు. ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్(1-3 ప్రయాణికులు)

ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ టారిఫ్: (4 నుంచి 6 ప్రయాణికులు)

Irctc 5 Days Tour Package 2

Irctc 5 Days Tour Package 2

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?