IRCTC: సమ్మర్‌లో అండమాన్‌ ట్రిప్‌ వేస్తే ఉంటుంది.. మీకోసమే ఈ స్పెషల్‌ ప్యాకేజీ

మండుటెండల్లో అలా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తే ఆ కిక్కే వేరు కదా.! అలాంటిది ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన అండమాన్‌ ట్రిప్‌ వెళ్తే అందమైన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు కదూ! మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీని అందిస్తోంది. చెన్నై నుంచి ఎయిర్‌ ప్యాక్‌ను అందిస్తున్నారు. హావెలాక్, నీల్, పోర్ట్ బ్లెయిర్ లో ఐదు రాత్రులు/ ఆరు రోజులు...

IRCTC: సమ్మర్‌లో అండమాన్‌ ట్రిప్‌ వేస్తే ఉంటుంది.. మీకోసమే ఈ స్పెషల్‌ ప్యాకేజీ
Irctc Andaman
Follow us

|

Updated on: Apr 23, 2024 | 3:22 PM

మండుటెండల్లో అలా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తే ఆ కిక్కే వేరు కదా.! అలాంటిది ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన అండమాన్‌ ట్రిప్‌ వెళ్తే అందమైన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు కదూ! మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీని అందిస్తోంది. చెన్నై నుంచి ఎయిర్‌ ప్యాక్‌ను అందిస్తున్నారు. హావెలాక్, నీల్, పోర్ట్ బ్లెయిర్ లో ఐదు రాత్రులు/ ఆరు రోజులు ప్యాకేజీ ఉండనుంది. మే 20వ తేదీన అందుబాటులో ఉన్న ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* తొలిరోజు చెన్నై నుంచి బయలుదేరి పోర్ట్‌ బ్లేయర్‌కు చేరుకుంటారు. అనంతరం హోట్‌లో చెకిన్‌ అవుతారు. అనంతరం పోర్ట్ బ్లెయిర్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్కార్బిన్స్‌ కోవ్‌ బీచ్‌ సంరద్శన ఉంటుంది. ఆ తర్వాత సెల్యులార్ జైలు సందర్శించారు. రాత్రి పోర్ట్‌ బ్లెయర్‌లో బస చేయాల్సి ఉంటుంది.

* రెండో రోజు టిఫిన్‌ చేసిన తర్వాత బ్రిటీష్ పాలనలో పోర్ట్ బ్లెయిర్ రాజధాని అయిన రాస్ ద్వీపాన్ని సందర్శిస్తారు. అనంతరం అక్కడ ఉన్న పలు ప్రదేశాలు విజిటింగ్ ఉంటుంది. సాయంత్రం షాపింగ్ తర్వాత బస అక్కడే ఉంటుంది.

* ఇక మూడోరజు హేవ్‌లాక్ ఐలాండ్‌కు వెళ్తారు. ఇందుకోసం పోర్ట్ బ్లెయిర్ నుంచి సముద్రం ద్వారా 54 కిమీలు ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం అక్కడ రాధా నగర్ బీచ్, కాలా పత్తర్ బీచ్‌ పర్యటిస్తారు. హేవ్‌లాక్ ద్వీపంలోని హోటల్‌లోనే రాత్రి బస ఉంటుంది.

* 4వ రోజు టిపిన్‌ చేసిన తర్వాత ఎలిఫెంటా బీచ్‌కి వెళ్తారు. భోజనం తర్వాత ఫెర్రీ ద్వారా నీల్ ద్వీపానికి వెళ్తారు. అనంతరం పలు ప్రాంతాలను సందర్శిస్తారు. అనతరం లక్ష్మణ్‌పూర్ బీచ్‌లో నాచురల్ బ్రిడ్జ్, సన్ సెట్ చూడవచ్చు. నైట్ రిసార్ట్‌లో స్టే చేస్తారు.

* 5వ రోజు టిఫిన్‌ చేసిన తర్వాత భరత్‌పూర్ బీచ్‌ని వెళ్తారు. భరత్‌పూర్ బీచ్ వాటర్ స్పోర్ట్స్‌ ఉంటాయి. మధ్యాహ్నం పోర్ట్‌బ్లేయర్‌కు చేరకుంటారు. పోర్ట్ బ్లెయిర్‌లోని హోటల్‌లో రాత్రి ఉంటుంది.

* ఇక చివరి రోజైన 6వ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత చెన్నైకి తిరుగు ప్రయాణం అవ్వడానికి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయంలో డ్రాప్ చేస్తారు. దీంతో ఈ టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. సింగిల్‌ షేరింగ్‌ కోసం రూ. 63,000 డబుల్‌ షేరింగ్‌కు రూ. 47,500 ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ. 45,200గా నిర్ణయించారు. ఇక చైల్డ్‌ విత్‌ బెడ్‌ అయితే రూ. 39,500, చైల్డ్‌ వితవుట్‌ బెడ్‌ అయితే రూ. 36,000గా నిర్ణయించారు.

మరిన్ని టూరిజం వార్తల  కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?