AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prachi Nigam: ఈ అమ్మాయి ముఖంపై వెంట్రుకలు.. టెన్త్ టాప్‌గా నిలిచినా వెక్కిరింతలు.. అండగా నిలిచిన నెటిజన్లు..

అకడమిక్ రంగంలో రాణిస్తున్నప్పటికీ ఆ అమ్మాయి తన రూపంతో పలు విమర్శలకు కారణమైంది. ఇప్పుడు ఈ అమ్మాయిని వెక్కిరిస్తూ ట్రోల్స్ పెరిగిపోతుండడంతో పలువురు నెటిజన్లు అమ్మాయికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి వాళ్లను లెక్క చేయొద్దంటూ ఆ బాలికకు ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రాచీ నిగమ్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)తో బాధపడుతోంది. ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరుగుతాయి. అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజెన్‌లను ఉత్పత్తి చేసే పరిస్థితిని, పురుషుల  సెక్స్ హార్మోన్లను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు.

Prachi Nigam: ఈ అమ్మాయి ముఖంపై వెంట్రుకలు.. టెన్త్ టాప్‌గా నిలిచినా వెక్కిరింతలు.. అండగా నిలిచిన నెటిజన్లు..
Up Board Class 10 Topper Prachi Nigam
Surya Kala
|

Updated on: Apr 22, 2024 | 7:07 PM

Share

ప్రతిభకు కొలమానం అందం కాదని నిరూపించి ఓ బాలిక. పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఏకంగా 98.5 శాతం స్కోర్ సాధించి ట్రోలర్స్ కు స్మూత్ గా సమాధానం చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 98.5 శాతం స్కోర్‌ సాధించిన ప్రాచీ నిగమ్‌ అనే బాలిక ఫోటో సర్వత్రా వైరల్‌గా మారింది. అయితే ఆమె ఫోటో చాలా ట్రోల్స్‌కు కారణమైంది. అకడమిక్ రంగంలో రాణిస్తున్నప్పటికీ ఆ అమ్మాయి తన రూపంతో పలు విమర్శలకు కారణమైంది. ఇప్పుడు ఈ అమ్మాయిని వెక్కిరిస్తూ ట్రోల్స్ పెరిగిపోతుండడంతో పలువురు నెటిజన్లు అమ్మాయికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి వాళ్లను లెక్క చేయొద్దంటూ ఆ బాలికకు ధైర్యాన్ని నింపుతున్నారు.

ప్రాచీ నిగమ్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)తో బాధపడుతోంది. ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరుగుతాయి. అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజెన్‌లను ఉత్పత్తి చేసే పరిస్థితిని, పురుషుల  సెక్స్ హార్మోన్లను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్య యుక్తవయసులో కనిపిస్తుంది. దీని కారణంగా పురుషులకు మీసం వచ్చినట్లు స్త్రీలకు కూడా మీసం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

— రోహన్ దువా (@rohanduaT02) ఏప్రిల్ 20, 2024

ఈ అమ్మాయిని వెక్కిరిస్తూ ట్రోల్స్ పెరిగిపోతుండడంతో పలువురు నెటిజన్లు అమ్మాయికి మద్దతుగా నిలుస్తున్నారు. “యుపి బోర్డ్ హైస్కూల్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచినందుకు ప్రాచీ నిగమ్‌ని నేను అభినందిస్తున్నాను. ప్రజలు ఆమెను ట్రోల్ చేస్తున్నవారిని చూస్తుంటే.. ప్రస్తుతం సమాజంలో చాలా మంది    శారీరకంగానే కాదు..  సామాజికంగా, మానసికంగా కూడా క్షీణిస్తున్నారని కామెంట్ చేయగా.. తన పరిస్థితిని దైర్యంగా ఎదుర్కొంటూ పట్టుదలతో ఈ విజయాన్ని సాధించినందుకు గర్వంగా ఉంది” అని ఆరోగ్య కోచ్ ప్రియాంక మటన్హేలియా కామెంట్ చేశారు. తాను సమాజం నుంచి ఎంత వెక్కిరింతలు, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నా.. ప్రాచీ టాపర్ గా నిలిచింది.. దీంతో ఆమె కృషి, దైర్యం, పట్టుదల గురించి అర్ధం అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ బాలిక పేరు ట్రెండింగ్ లో ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..