తన కుమార్తెలను స్కూల్‌కు పంపని తల్లి, కోటీశ్వరులు కావడానికి ప్రత్యేక పద్ధతిని నేర్పుతోంది
బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ మాత్రం తన కూతుళ్లను స్కూల్‌కి పంపడం లేదు సరిగా ఇందుకు భిన్నమైన ఆలోచన చెబుతుంది. తన కూతుళ్లు కోటీశ్వరులు కావాలనేది ఆ తల్లి కల. సహజంగానే చదువు లేకుండా ఎవరైనా కోటీశ్వరులు ఎలా అవుతారు అనే ప్రశ్న ఎవరి మదిలోనైనా కదులుతుంది. వాస్తవానికి ఈ మహిళ ఇంట్లోనే తన కూతుళ్లకు చదువు చెబుతోంది.. అంతేకాదు డబ్బు సంపాదన గురించి డబ్భుకు ఎప్పటికీ కొరత రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో ఓ ప్రత్యేకమైన మార్గాన్ని కూడా చెబుతోంది.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చూసుకోవాలని.. సమాజంలో మంచి పొజిషన్ లో ఉండాలని కలలు కంటారు. అందుకే తమ శక్తికి మించి పిల్లలకు మంచి చదువులు అందించడానికి పేరున్న పాఠశాలలకు పంపిస్తారు. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ తమ జీవితంలో ఏదో ఒక స్థానం సాధిస్తారు అనే విశ్వాసం. అయితే బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ మాత్రం తన కూతుళ్లను స్కూల్‌కి పంపడం లేదు సరిగా ఇందుకు భిన్నమైన ఆలోచన చెబుతుంది. తన కూతుళ్లు కోటీశ్వరులు కావాలనేది ఆ తల్లి కల. సహజంగానే చదువు లేకుండా ఎవరైనా కోటీశ్వరులు ఎలా అవుతారు అనే ప్రశ్న ఎవరి మదిలోనైనా కదులుతుంది. వాస్తవానికి ఈ మహిళ ఇంట్లోనే తన కూతుళ్లకు చదువు చెబుతోంది.. అంతేకాదు డబ్బు సంపాదన గురించి డబ్భుకు ఎప్పటికీ కొరత రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో ఓ ప్రత్యేకమైన మార్గాన్ని కూడా చెబుతోంది.
TikToker Amanda Lynn Custer ఇటీవల ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె తన కుమార్తెలను ఎందుకు పాఠశాలకు పంపడం లేదో ప్రజలకు వివరంగా చెప్పింది. తన కూతుళ్లకు స్వాతంత్య్రంగా బతకడం ఎలాగో నేర్పిస్తున్నానని చెప్పింది. అంతేకాదు బ్రిటన్‌లో ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను పాఠశాలకు పంపకుండా ఇంట్లోనే చదివించవచ్చని ఆమె చెప్పింది.
నిబంధన ప్రకారం మీ పిల్లలకు పాఠశాల నిర్వహించే పాఠ్యాంశాలను బోధించాల్సిన అవసరం లేదు అని ఆ మహిళ చెప్పింది. అంతేకాదు ఇంట్లో విద్యను పొందేందుకు ఎటువంటి నిర్ణీత సమయాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని వివరించింది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
ది సన్ నివేదిక ప్రకారం అమండా తన కుమార్తెలను ఇంట్లో చదివించడమే కాదు తమ పిల్లలకు డే ట్రేడింగ్ కూడా నేర్పిస్తోంది. ఇది స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే పద్ధతి.. దీనిలో మీరు ఒక రోజులో ఏదైనా షేరును కొనుగోలు చేయవచ్చు.. దానిని విక్రయించవచ్చు. డే ట్రేడింగ్‌లో షేర్ల ధరలు పెరగడం, తగ్గడం వల్ల ప్రజలు ప్రయోజనం పొందుతారు. ఆర్థిక నష్టాల బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులు డే ట్రేడింగ్ ద్వారా లక్షాధికారులు అవుతున్నారు.
కనుక తన పిల్లలకు ఇప్పటి నుంచే ఈ ట్రేడింగ్ స్కిల్ నేర్పిస్తున్నాను.. తద్వారా తన పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా జీవించి లక్షలు, కోట్లు సంపాదించవచ్చునని ఆ మహిళ చెప్పింది. నివేదిక ప్రకారం అమండా షేర్ చేసిన వీడియోలో.. ఆమె పెద్ద కుమార్తె కెమెరా వైపు ఫోన్ చూపిస్తుంది. తాను ఎంత లాభపడిందో చెబుతుంది. తాను గత 4 సంవత్సరాలుగా డే ట్రేడింగ్ చేస్తున్నానని.. ఈ డబ్బుతో తన ఇంటిని నడుపుతున్నానని మహిళ చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..