Yoga Benefits: వేసవిలో బలహీనంగా, అలసిపోయినట్లు అనిపిస్తుందా.. రోజుని ఈ రెండు యోగాలతో ప్రారంభించండి..

ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి యోగా చేస్తే రోజంతా శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. యోగా మన శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ ఏదైనా ఆరోగ్య సమస్యలు లేదా పోషకాహార లోపం కారణంగా మీరు బలహీనంగా అనిపించవచ్చు. అందువల్ల నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి కొన్ని యోగాసనాలు ఉన్నాయి, ఇవి ఉదయం నిద్రలేచిన తర్వాత చేస్తే, రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

Yoga Benefits: వేసవిలో బలహీనంగా, అలసిపోయినట్లు అనిపిస్తుందా.. రోజుని ఈ రెండు యోగాలతో ప్రారంభించండి..
Yoga Benefits
Follow us
Surya Kala

|

Updated on: Apr 22, 2024 | 3:50 PM

ప్రస్తుతం వేడి గాలులు, వడగాల్పులు పెరుగుతున్నాయి. ఈ వాతావరణంలో పరిగెత్తడం వల్ల అలసట, బలహీనంగా అనిపించడం సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. తినడం, నిద్రపోవడం,  ఉదయమే నిద్ర లేవడం వంటి దినచర్యలు నియమానుసారం చేయాలి. అంతేకాదు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి యోగా చేస్తే రోజంతా శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. యోగా మన శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ ఏదైనా ఆరోగ్య సమస్యలు లేదా పోషకాహార లోపం కారణంగా మీరు బలహీనంగా అనిపించవచ్చు. అందువల్ల నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి కొన్ని యోగాసనాలు ఉన్నాయి, ఇవి ఉదయం నిద్రలేచిన తర్వాత చేస్తే, రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఉదయం మీ కోసం కొన్ని నిమిషాలు కేటాయించడం, యోగా సాధన చేయడం చాలా ముఖ్యం. ఆ ఆసనాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

భుజంగాసనం: ఈ భుజంగాసనం శరీరాన్ని శక్తివంతంగా, కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఫ్లెక్సిబిలిటీని తీసుకురావడంలో పాటు బొడ్డు కొవ్వును తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

భుజంగాసనం ఎలా చేయాలంటే

ఈ ఆసనం వేయడానికి ముందుగా యోగా మ్యాట్‌పై పొట్టని అనుస్తూ బోర్లా ​​పడుకోండి. ఇప్పుడు మీ రెండు అరచేతులను నేలమీద పెట్టి.. వాటిపై మీ బరువును ఉంచి మీ మెడను, ఛాతీని పైకి ఎత్తండి. తర్వాత తలతో పాటు నాభిని పైకి ఎత్తండి. పైకప్పు వైపు చూస్తున్నట్లుగా ఉండి 10 నుంచి 15 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉన్న తర్వాత.. సాధారణ స్థితికి తిరిగి రండి.

ఇవి కూడా చదవండి

జ్ఞాన ముద్ర: ప్రస్తుతం ఓ వైపు ఉద్యోగం చేస్తూ.. మరోవైపు కుటుంబ బాధ్యతలను నెరవేస్తూ కాలంతో పోటీపడుతూ నడుస్తున్నారు. మరోవైపు అనేక సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీని వల్ల వారి ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు ఏ పనీ సరిగా చేయాలని అనిపించక పోవడంతో పాటు విసుగు, అలసట మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో ఈ సందడి మధ్య తమ మనస్సు, హృదయాన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి. దీని కోసం జ్ఞాన ముద్రను ఆశ్రయించండి. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత శక్తి,  మానసిక శక్తి పెరుగుతుంది.

జ్ఞాన ముద్రను ఎలా చేయాలంటే

జ్ఞాన ముద్రను ధ్యాన ముద్ర అని కూడా అంటారు. ఈ భంగిమ చేయడానికి ధ్యాన భంగిమలో కూర్చోండి. మీ నడుము, మెడ నిటారుగా ఉంచండి. మీ మణికట్టును మీ మోకాళ్లపై ఉంచండి. ఇప్పుడు రెండు చేతుల చూపుడు వేళ్ల చివరలను వంచి బొటనవేలుతో కలపండి. మిగిలిన మూడు వేళ్లను నిటారుగా ఉంచి, వాటిని కలపండి. ఇప్పుడు సౌకర్యవంతమైన భంగిమలో కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో కూర్చోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..