ప్రపంచంలో అత్యంత పుల్లని మిఠాయి తిని ఆస్పత్రిపాలైన బాలిక.. శాశ్వతంగా మూగబోయిన గొంతు

ఈ అమ్మాయి పేరు మియా-రోజ్ బోయర్. ఆ చిన్నారి బాలిక వయస్సు కేవలం 10 సంవత్సరాలు. వారాంతంలో ఒక రోజు మియా, తన సోదరి, బంధువులతో కలిసి సినిమా చూడటానికి వెళ్ళింది. ఆ సమయంలో స్నాక్స్ తినడానికి వెళ్లినట్లు ఆమె తల్లి చెప్పింది. ఈ సమయంలో మియా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‌లో 'బ్లాక్ డెత్' స్వీట్లు తింటూ ముఖాన్ని విచిత్రంగా మార్చడం గమనించింది. అది చూసిన తర్వాత మియాకు కూడా ఆ స్వీట్ తినాలనే కోరిక కలిగింది. ఆ తర్వాత ఒకరోజు బ్లాక్ డెత్ మిఠాయిని తినడానికి ప్రయత్నించింది. అప్పుడు పుల్లగా ఉందని దాన్ని ఉమ్మివేయాలని ప్రయత్నించి పొరపాటున మింగడంతో అది నేరుగా గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది

ప్రపంచంలో అత్యంత పుల్లని మిఠాయి తిని ఆస్పత్రిపాలైన బాలిక.. శాశ్వతంగా మూగబోయిన గొంతు
Black Death SweetImage Credit source: Pixabay
Follow us

|

Updated on: Apr 22, 2024 | 4:19 PM

పిల్లలు ఎక్కువగా స్వీట్లు, చాక్లెట్లను ఇష్టంగా తింటారు. సాధారణంగా స్వీట్లు రుచిలో తియ్యగా ఉంటాయి. కొన్ని తియ్యగా పుల్లగా ఉండి రుచిగా తినే కొద్దీ తినాలనిపించేవిగా ఉంటాయి. అంటే తీపి పుల్లని రుచులు కలిపి ఉన్న కొన్ని క్యాండీలు ఉన్నాయి. అయితే ‘ప్రపంచంలో అత్యంత పుల్లని మిఠాయి ఏదో మీకు తెలుసా? ఆ స్వీట్‌ని ‘బ్లాక్ డెత్’ స్వీట్ అంటారు. దీనిని చాలా జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే ఇది కొన్ని సార్లు మనుషులకు ప్రమాదకరంగా మారుతుంది. అవును.. ఈ స్వీట్లు తిన్న తర్వాత ఓ అమ్మాయికి అలాంటిదే జరిగింది. ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

ఈ అమ్మాయి పేరు మియా-రోజ్ బోయర్. ఆ చిన్నారి బాలిక వయస్సు కేవలం 10 సంవత్సరాలు. వారాంతంలో ఒక రోజు మియా, తన సోదరి, బంధువులతో కలిసి సినిమా చూడటానికి వెళ్ళింది. ఆ సమయంలో స్నాక్స్ తినడానికి వెళ్లినట్లు ఆమె తల్లి చెప్పింది. ఈ సమయంలో మియా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‌లో ‘బ్లాక్ డెత్’ స్వీట్లు తింటూ ముఖాన్ని విచిత్రంగా మార్చడం గమనించింది. అది చూసిన తర్వాత మియాకు కూడా ఆ స్వీట్ తినాలనే కోరిక కలిగింది. ఆ తర్వాత ఒకరోజు బ్లాక్ డెత్ మిఠాయిని తినడానికి ప్రయత్నించింది. అప్పుడు పుల్లగా ఉందని దాన్ని ఉమ్మివేయాలని ప్రయత్నించి పొరపాటున మింగడంతో అది నేరుగా గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది.

శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది

LadBible అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం మియా పెదవులు నీలం రంగులోకి మారాయి. సుమారు రెండు నిమిషాల తర్వాత ఆమె గొంతులో ఇరుక్కున్న స్వీట్లను బయటకు తీసినప్పటికీ.. ఆ బాలికకు ఊపిరి సరిగా అందకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. వెంటనే వైద్యులు బాధితురాలికి ఆక్సిజన్, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ అందించారు. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తొలగింది. ఆ బాలిక పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. అయితే ఈ బ్లాక్ డెత్ ని తినడం వల్ల తన కుమార్తె గొంతు శాశ్వతంగా పాడైపోయిందని ఆమె తల్లి ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

బ్లాక్ డెత్ ఎంత ప్రమాదకరమైనదంటే

నివేదికల ప్రకారం ‘ప్రపంచపు పుల్లని మిఠాయిగా పిలవబడే ఈ బ్లాక్ డెత్ స్వీట్ నిమ్మకాయలాగా అత్యంత పుల్లగా ఉంటుంది. ఇది తాత్కాలికంగా నోరుని, కడుపులో చికాకు కలిగిస్తుంది. దీనిని విక్రయించే ముందు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఎనిమిదేళ్ల వయసు కంటే ఎక్కువ ఉండాలి.. అదే విధంగా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే తినాలనే హెచ్చరికతో విక్రయిస్తారు. అయితే ఈ మిఠాయి పెద్దలకు కూడా హాని చేస్తుంది.. ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..