Depression and Suicide: డిప్రెషన్ చివరి దశ ఏమిటి? ఎందుకు ఆత్మహత్య ఆలోచన చేస్తాడో తెలుసా
డిప్రెషన్ అనేది వైద్యపరమైన పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు. ఎవరి మెదడులోనైనా సెరోటోనిన్ హార్మోన్ తక్కువగా విడుదలైనప్పుడు.. వారు నిరాశకు గురవుతారు. ఈ సమయంలో వారి ప్రవర్తన మారడం ప్రారంభిస్తే.. వారు ఏ పనిని మెరుగ్గా చేయలేరు. ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. అప్పుడు ఇది మంచి సంకేతం కాదు. కొన్ని లక్షణాలు మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సూచిస్తున్నాయి.
శరీరకంగా అనారోగ్యంగా ఉంటే మెడిసిన్స్ ఉపయోగించి నయం చేసుకోవచ్చు. అయితే మానసికంగా అనారోగ్యం బారిన పడితే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. మానసికంగా అనారోగ్యం బారినపడినప్పుడు కొందరు వైద్యుల సలహా తీసుకుంటారు. అనేక సందర్భాల్లో కొందరు మానసిక ఆనారోగ్యంతో సంవత్సరాలుగా ఉంటారు. అయితే ఇలా తనకు మానసిక ఇబ్బంది ఉందనే సంగతి వారికే తెలియదు. అటువంటి పరిస్థితిలో కొందరు నిరాశకు గురవుతారు. డిప్రెషన్ అనేది ఒక సాధారణ మానసిక సమస్య.. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. అది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఎందుకంటే ఇతర వ్యాధుల మాదిరిగానే డిప్రెషన్‌కు కూడా చివరి దశ అనేది ఉంటుంది.
డిప్రెషన్ అనేది వైద్యపరమైన పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు. ఎవరి మెదడులోనైనా సెరోటోనిన్ హార్మోన్ తక్కువగా విడుదలైనప్పుడు.. వారు నిరాశకు గురవుతారు. ఈ సమయంలో వారి ప్రవర్తన మారడం ప్రారంభిస్తే.. వారు ఏ పనిని మెరుగ్గా చేయలేరు. ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. అప్పుడు ఇది మంచి సంకేతం కాదు. కొన్ని లక్షణాలు మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సూచిస్తున్నాయి.
డిప్రెషన్ చివరి దశ ఏమిటంటే
విపరీతమైన పని ఒత్తిడి, జీవితంలో పెను విషాదకరమైన సంఘటన, వ్యక్తి మరణం వంటి సంఘటనల వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉందని ఘజియాబాద్‌లోని జిల్లా ఆసుపత్రి మానసిక వైద్యుడు డాక్టర్ ఎకె కుమార్ చెబుతున్నారు. డిప్రెషన్ ప్రారంభంలో వ్యక్తుల ప్రవర్తనలో మార్పు ఉంటుంది. మునుపటిలా ఏ పనీ చేయరు. అంతేకాదు ఇతరులతో మాట్లాడడం, వారితో ప్రేమగా ఉండడం తగ్గిస్తారు.
ఈ సమస్యలను మొదట్లో పట్టించుకోకపోతే.. వారి మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. అప్పుడు డిప్రెషన్ రెండవ దశ, తర్వాత చివరి దశకు వెళ్తారు. ఈ సమయంలో వారి ఆలోచనా శక్తి, అవగాహన తగ్గిపోతుంది. సొంత చర్యలపై నియంత్రణ కోల్పోతారు. ఇటువంటి పరిస్థితి ఏ వ్యక్తిలోనైనా ఏర్పడితే ఎటువంటి పనులు చేయడానికైనా వెనుకాడరు. చివరికి తనకు తాను హానిని చేర్చుకోవడానికి కూడా వెనుకాడరు. ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు డిప్రెషన్ ప్రధాన కారణమని డాక్టర్ కుమార్ చెప్పారు. డిప్రెషన్ చివరి దశకు చేరుకునే పరిస్థితి ఏర్పడితే దేనికీ విలువ ఇవ్వడు.. చివరికి తన ప్రాణం కూడా ఎక్కువ అని భావించడు. ఎక్కువ కాలం మానసిక సమస్యలతో బాధపడుతూ జీవితంపై ఆశలు వదులుకుని ఆత్మహత్యకు పాల్పడతాడు.
డిప్రెషన్‌కు చికిత్స సులభం
డిప్రెషన్‌కు చికిత్స చేయడం సులభమని.. అయితే ప్రజలు దీనిని ఒక వ్యాధిగా పరిగణించి వైద్యుడి వద్ద చికిత్స పొందడం చాలా ముఖ్యం అని డాక్టర్ కుమార్ చెప్పారు. అన్నింటిలో మొదటిది డిప్రెషన్ లక్షణాలు కనిపించిన వెంటనే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడాలని గుర్తుంచుకోండి. మీ మనసులో ఏదైనా సమస్య ఉంటే మీ మనసుకు నచ్చిన వారితో పంచుకోండి. తరువాత వైద్యులను సంప్రదించడం అవసరం. ఈ సమస్యను కౌన్సెలింగ్, మందులతో సులభంగా నయం చేయవచ్చని చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..