Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World’s Oldest Curry: మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..

కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలతో ఎలాంటి రెసిపీలు చేసినా అమృతమనే చెప్పాలి. సరిగ్గా వండితే చికెన్, మటన్ కూడా అవసరం లేదు. అంత రుచిగా ఉంటాయి వంటలు. వంకాయలతో పచ్చళ్లు, స్నాక్స్, కర్రీలు తయారు చేస్తారు. అయితే ఎక్కువగా గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా మంది ఇష్టం. ఈ కర్రీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా నోట్లో వంకాయ పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది. ఆహా చెబుతుంటూనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. అదే మరి ఈ గుత్తి వంకాయ..

World’s Oldest Curry: మనం తినే గుత్తి వంకాయ కర్రీకి 4000 ఏళ్ల చరిత్ర ఉందట..
World’s Oldest Curry
Follow us
Chinni Enni

|

Updated on: Apr 23, 2024 | 3:43 PM

కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలతో ఎలాంటి రెసిపీలు చేసినా అమృతమనే చెప్పాలి. సరిగ్గా వండితే చికెన్, మటన్ కూడా అవసరం లేదు. అంత రుచిగా ఉంటాయి వంటలు. వంకాయలతో పచ్చళ్లు, స్నాక్స్, కర్రీలు తయారు చేస్తారు. అయితే ఎక్కువగా గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా మంది ఇష్టం. ఈ కర్రీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా నోట్లో వంకాయ పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది. ఆహా చెబుతుంటూనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. అదే మరి ఈ గుత్తి వంకాయ మహిమ. ఈ గుత్తి వంకాయ కర్రీని పలు భాషల్లో పలు రకాలుగా పిలుస్తారు. అలాగే చాలా రకాల స్టైల్లో తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కర్రీ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ఈ కర్రీకి ఏకంగా 4 వేల ఏళ్ల చరిత్ర ఉందట. అదేంటా? అని షాక్ అవుతున్నారా? దీని చరిత్ర గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

బైగాన్ కర్రీకి 4000 ఏళ్ల వయసు..

ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్ తన ఇన్ స్టాలో ఒక రీల్‌ను పోస్ట్ చేవారు. ప్రస్తుతం ఈ రీల్ సోషల్ మీడియాల జోరుగా వైరల్ అవుతుంది. ఇందులో అత్యంత పురాతనమైన బైగన్ కర్రీ గురించి చెప్పారు. దీన్ని దాదాపు 4000 ఏళ్ల నుండి మనిషి జాతి తింటున్నారని తెలిపారు. ఈ విషయం ఎలా తెలిసిందా? అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది కూడా క్లారిఫై చేస్తాం.

ఎలా తెలిసిందంటే..

హర్యానాలోని ఫర్మానా ప్రాంతంలో హరప్పా నాగరిత ఆనవాళ్లు లభించాయన్న విషయం తెలిసిందే. దీనిపై నిపుణులు మరింతగా పరిశోధనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే అక్కడ తవ్వకాల్లో మట్టి కుండలు కనిపించాయి. వీటిని ప్రయోగ శాలకు పంపించగా.. ఆసక్తికర విషయం తెలిసింది. నిపుణులు కనిపెట్టిన దాని ప్రకారం.. ఆ కుండల్లో అల్లం, వెల్లుల్లి, వంకాయ, పసుపు అవశేషాలు దొరికాయట.

ఇవి కూడా చదవండి

మరింత లోతుగా పరిశోధనలు..

ఇది 4000 ఏళ్ల క్రితం నాటిదని వాళ్లు తేల్చారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ వంకాయ కర్రీని అప్పటి నుంచే తింటున్నారన్న మాట. దీంతో మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింగ వైరల్‌గా మారింది. మొత్తానికి మన వంకాయ కర్రీకి అంత చరిత్ర ఉందని తెలిసింది.