Viral Video: భోజనం వడ్డిస్తుండగా కూరలో కదిలిన పొడవాటి ఆకారం.. ఏంటా అని చూడగా! బాబోయ్‌..పా..పా..

మామూలు పామును చూస్తేనే అల్లంత దూరం పారిపోతాం. అలాంటిది అత్యంత విషపూరితమైన పాము బతికుండగానే కూరలో పడిపోయింది.. ఈ విషయం తెలియని ఓ వ్యక్తి పులుసులో బాగా కలిపి గరిటెతో తీసి విస్తరిలో వడ్డించబోయాడు. కానీ హఠాత్తుగా గరిటెలో ఉన్న కూర కదలడం ప్రారంభించింది. ఏంటా అని తేరి చూడగా అది.. ఓ పాముగా గుర్తించాడు. ఇదేదో సినిమా కథ అనుకునేరు..

Viral Video: భోజనం వడ్డిస్తుండగా కూరలో కదిలిన పొడవాటి ఆకారం.. ఏంటా అని చూడగా! బాబోయ్‌..పా..పా..
Snake In Vegetable Curry
Follow us

|

Updated on: Apr 23, 2024 | 1:43 PM

మామూలు పామును చూస్తేనే అల్లంత దూరం పారిపోతాం. అలాంటిది అత్యంత విషపూరితమైన పాము బతికుండగానే కూరలో పడిపోయింది.. ఈ విషయం తెలియని ఓ వ్యక్తి పులుసులో బాగా కలిపి గరిటెతో తీసి విస్తరిలో వడ్డించబోయాడు. కానీ హఠాత్తుగా గరిటెలో ఉన్న కూర కదలడం ప్రారంభించింది. ఏంటా అని తేరి చూడగా అది.. ఓ పాముగా గుర్తించాడు. ఇదేదో సినిమా కథ అనుకునేరు. ఇది నిజంగా జరిగిన సంఘటనే. మహారాష్ట్రలోని భండారాలో ఫుడ్ సర్వీస్‌ లోకేషన్‌లో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

మహారాష్ట్రలోని భండారాలోని ఫుడ్ సర్వీస్ లొకేషన్‌లో వెజిటబుల్ కర్రీలో ఓ పాము పిల్ల కదులుతూ ఉండటం వీడియోలో చూడొచ్చు. సర్వీస్‌ బాయ్‌ మొదట ఆ పాము చనిపోయి ఉంటుందని భావించాడు. కానీ కెమెరా జూమ్‌ చేసి చూడగా.. అది కదులుతున్నట్లు కనిపించింది. ఈ వీడియో క్లిప్‌లో కనిపించిన పాము మన దేశంలోనే మూడవ అత్యంత విషపూరితమైన పాముగా గుర్తించారు. ఈ వీడియోను అఫీషియల్‌ సత్యం అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో మిలియన్లలో వ్యూస్‌, లక్షల్లో లైకులు రావడంతో నెట్టింట వైరల్గా మారింది. నిజానికి ఇది పాత వీడియో.. కానీ ప్రస్తుతం ఇది మరోమారు నెట్టింట వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్న విధాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కర్రీల కనిపించే పామును ఇసుక బోవా అని పిలుస్తారు. ఇదేమీ విషపూరితం కాదని ఓ యూజర్‌ కామెంట్ చేయగా.. మరొకరేమో ఈ పాము అత్యంత విషపూరితమైనది, ఇది రస్సెల్ వైపర్ జాతికి చెందినదని పేర్కొన్నారు. ముందు ఆ కర్రీ వేసుకుని తిన్నా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లండి.. అంటూ మరో యూజర్‌ తక్షణ కర్తవ్యాన్ని బోధించాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే బీహార్‌లోని అరారియా జిల్లా ఫోర్బ్స్‌గంజ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 2023లో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం కోసం ఓ ఎన్జీవో తయారుచేసిన భోజనంలో పాము కనిపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..