Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు.. ఆలయం ఎక్కడంటే

బలోద్ జిల్లాలోని కమ్రౌడ్ గ్రామంలోని ఆలయంలో ఉన్న హనుమంతుడి  విగ్రహం 400 సంవత్సరాల నాటిదని చెబుతారు. 400 సంవత్సరాల క్రితం కమ్రాడ్ గ్రామం చుట్టూ చాలా కరువు ఉండేదని చెబుతారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒకరోజు ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా అతని నాగలి భూమిలో కూరుకుపోయింది. చాలా శ్రమ తర్వాత నాగలిని బయటకు తీయగా ఆ స్థలంలో భూమికింద హనుమంతుడి విగ్రహం కనిపించింది. అనంతరం విగ్రహాన్ని శుభ్రం చేసి అక్కడ ప్రతిష్ఠించారు.

400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు.. ఆలయం ఎక్కడంటే
Balod Bhumiphod Hanuman Temple (2)
Follow us
Surya Kala

|

Updated on: Apr 23, 2024 | 6:49 PM

హిందూ మతంలో హనుమంతుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు తన భక్తుల భయాందోళనలను, ఇబ్బందులను తొలగించి భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని నమ్మకం. దీనికి సజీవ ఉదాహరణ ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా ప్రధాన కార్యాలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమ్రాడ్ గ్రామంలో ఉన్న హనుమంతుడి ఆలయం. హనుమాన్ జన్మ దినోత్సవం రోజున హనుమంతుడు తన భక్తుల కోరికలన్నింటినీ తీర్చే అద్భుత ఆలయం అని ఈ ఆలయం గురించి ఒక నమ్మకం.

400 సంవత్సరాల నాటి హనుమంతుడి విగ్రహం

ఛత్తీస్‌గఢ్‌లోని కమ్రాడ్ గ్రామంలో ఉన్న హనుమంతుడి ఆలయాన్ని 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. 400 ఏళ్ల క్రితమే పురాతన హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ కోరికలు తీర్చుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయం ఇప్పుడు మొత్తం ఛత్తీస్‌గఢ్‌లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధి చెందడం మొదలైంది. దీంతో ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ భారీ కార్యక్రమాలు, హవన, భారీ భండారాలు నిర్వహిస్తారు.

400 ఏళ్ల నాటి ఈ విగ్రహం ఆవిష్కరణ వెనుక కథ

బలోద్ జిల్లాలోని కమ్రౌడ్ గ్రామంలోని ఆలయంలో ఉన్న హనుమంతుడి  విగ్రహం 400 సంవత్సరాల నాటిదని చెబుతారు. 400 సంవత్సరాల క్రితం కమ్రాడ్ గ్రామం చుట్టూ చాలా కరువు ఉండేదని చెబుతారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒకరోజు ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా అతని నాగలి భూమిలో కూరుకుపోయింది. చాలా శ్రమ తర్వాత నాగలిని బయటకు తీయగా ఆ స్థలంలో భూమికింద హనుమంతుడి విగ్రహం కనిపించింది. అనంతరం విగ్రహాన్ని శుభ్రం చేసి అక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ హనుమంతుడి విగ్రహాన్ని భూ ఫోడ్ హనుమాన్ జీ అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

విగ్రహం ఎత్తు దానికదే పెరుగుతుంది

ఈ హనుమంతుని విగ్రహం కోసం ఒక చిన్న ఆలయం కూడా నిర్మించారు. అయితే విగ్రహం ఎత్తు క్రమంగా పెరగడం ప్రారంభమైంది. దీంతో ఆలయ పైకప్పు విరిగిపోయింది. ఇలా 3 నుంచి 4 సార్లు జరిగింది. ఈ హనుమంతుడి విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ విగ్రహం 12 అడుగుల పొడవుగా మారింది. ఈ విగ్రహం భూమిలో దొరికినప్పుడు ఇది కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉంది. ఇది నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. అందువల్ల భక్తులు, దాతల సహకారంతో ఈ విగ్రహం దొరికిన ప్రదేశంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించారు. దీని పైకప్పు ఎత్తు 28 అడుగుల వరకు ఏర్పరచారు. క్రమంగా ఈ ఆలయంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది.

అద్భుత హనుమంతుడి దేవాలయం

ఈ ఆలయం అద్భుత హనుమంతుడిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ  కోరికలను తీర్చమంటూ ఇక్కడికి వస్తుంటారు. ఈ హనుమంతుని ఆలయంలో కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు.

ఆలయంలో శనీశ్వరుడు, కాళికాదేవి విగ్రహాలు

ఆలయ ప్రాంగణంలో, బయటి భాగంలో ఒక గొప్ప శివలింగం ఉంది. ఒక వైపు శనీశ్వరుడిని ప్రతిష్టించారు.  మరొక వైపు కాళికాదేవి పెద్ద పెద్ద విగ్రహం ఉంది. ఇది ప్రజలను ఆకర్షిస్తుంది. ఇవి చాలా గ్రాండ్‌గా, అందంగా ఉంటాయి. కనుక ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని పిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు