AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana Masam 2025: శ్రావణ మాసంలో స్త్రీలు ఆకుపచ్చ చీర, ఆకు పచ్చ గాజులు ఎందుకు ధరిస్తారు..? శాస్త్రీయ కోణం ఏమిటంటే..

శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెల అంటే మహిళలకు చాలా ఇష్టం. వరలక్ష్మి, మంగళ గౌరీ అనుగ్రహం కోసం నోములు, వ్రతాలని జరుపుకుంటారు. అంతేకాదు శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో మహిళలు ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ దుస్తులు ధరించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితిలో శ్రావణ మాసానికి ఆకుపచ్చ రంగుతో ఉన్న సంబంధం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Shravana Masam 2025: శ్రావణ మాసంలో స్త్రీలు ఆకుపచ్చ చీర, ఆకు పచ్చ గాజులు ఎందుకు ధరిస్తారు..? శాస్త్రీయ కోణం ఏమిటంటే..
Shravana Masam
Surya Kala
|

Updated on: Jul 29, 2025 | 1:28 PM

Share

శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసాన్ని హిందూ క్యాలెండర్‌లో ఐదవ నెల. ఈ నెల మొత్తం ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. శివకేశవులతో పాటు వరలక్ష్మీ, మంగళ గౌరీలను పుజిస్తారు. అమ్మవారి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందడానికి ఈ నెల ఉత్తమ సమయం అని చెబుతారు. అందుకనే ఈ నెలలో సోమవారం, మంగళ, శుక్ర వారాల్లో ఉపవాశం ఉంటారు. ఇతర నియమాలు అనుసరించి పూజలను నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో ఆచరించే సాంప్రదాయాల్లో ఒకటి ఆకుపచ్చ దుస్తులు ధరించడం, ఆకు పచ్చ గాజులు ధరించడం. ఇలా స్త్రీలు ఆకూ పచ్చ రంగు బట్టలు, గాజులతో కనిపిస్తూనే ఉంటారు. అయితే దీనివెనుక గల కారణం అందరికీ తెలియదు. ఈ రోజు శ్రావణ మాసానికి, ఆకూ పచ్చ రంగుకి మధ్య ఉన్న రంగుని గురించి తెలుసుకుందాం..

ఆకుపచ్చ రంగుకి శ్రావణ మాసానికి సంబంధం శ్రావణ మాసం వర్షాకాలం. ఈ సమయంలో కురిసే వర్షం కారణంగా ప్రతిచోటా పచ్చదనం నిండి ఉంటుంది. వర్షాకాలంలో ప్రకృతిలోని పచ్చదనం, కొత్త జీవితం, సంతానోత్పత్తిని సూచిస్తుంది. అందువల్ల మహిళలు కూడా శ్రావణ మాసంలో జీవితంలో కొత్త శక్తి, ప్రేమ, శ్రేయస్సు కావాలనే కోరికతో కొత్త జీవితానికి, శక్తికి చిహ్నంగా ఆకుపచ్చ రంగుతో తమను తాము అలంకరించుకుంటారు.

దీనితో పాటు ఆకుపచ్చ రంగును వైవాహిక ఆనందానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. అందువల్ల వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, అదృష్టం కోసం ఆకుపచ్చ గాజులు ధరిస్తారు.

ఇవి కూడా చదవండి

పార్వతి దేవికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం.

అంతేకాదు పార్వతి దేవికి ఆకుపచ్చ రంగు ఇష్టమైన రంగు అని నమ్ముతారు. శ్రావణ మాసంలో శివపార్వతులను ప్రత్యేకంగా పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో ఆకుపచ్చ గాజులు, ఆకు పచ్చ బట్టలు ధరించి దేవతను పూజించడం వలన అంతులేని అదృష్టం లభిస్తుంది.

అంతేకాదు ఆకుపచ్చ రంగును శుభం, శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ రంగును ధరించడం వల్ల వాతావరణంలో సానుకూల శక్తి ప్రసరిస్తుందని, మనసుకు శాంతి లభిస్తుందని అన్నారు.

రంగుల వెనుక ఉన్న శాస్త్రం అమతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఆకుపచ్చ రంగుకు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది. నిజానికి ఆయుర్వేదం చికిత్స ప్రకారం ఆకుపచ్చ రంగు ఒత్తిడిని తగ్గిస్తుంది. హృదయాన్ని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.