మహిళల ఆరోగ్యానికి సైలెంట్ కిల్లర్ అండాశయ క్యాన్సర్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..
మన దేశంలో రోజు రోజుకీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా స్త్రీలు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీటిల్లో ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించ కుండా సైలెంట్ కిల్లర్ అండాశయ క్యాన్సర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అండాశయ క్యాన్సర్ లక్షణాలు. ప్రారంభ దశలో సాధారణ ఇబ్బందిలే అనిపిస్తాయి. క్యాన్సర్ పెరిగిన తర్వాత గుర్తిస్తున్నారు. అందువల్ల ఈ క్యాన్సర్ కు సకాలంలో చికిత్స అందించడం ఆలస్యం అవుతుంది. ఈ నేపధ్యంలో అండాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

అండాశయ క్యాన్సర్ అనేది మహిళలకు వచ్చే సర్వసాధారణమైన క్యాన్సర్లలో ఒకటి. ఈ క్యాన్సర్ అండాశయాలలో సంభవిస్తుంది. అయితే ఈ క్యాన్సర్ కి సంబంధించిన ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ క్యాన్సర్ లక్షణాలు (అండాశయ క్యాన్సర్ లక్షణాలు) ప్రారంభ దశలో స్పష్టంగా తెలియవు. ఈ కారణంగా ఈ క్యాన్సర్ ఆలస్యంగా గుర్తించబడుతుంది. అయితే కొన్ని సంకేతాలను గుర్తించడం ద్వారా సకాలంలో చికిత్స అందిస్తే.. ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఈ రోజు అండాశయ క్యాన్సర్ కి సంబంధించిన ప్రారంభ 5 లక్షణాల గురించి తెలుసుకుందాం.
కడుపు వాపు లేదా ఉబ్బరం ఎటువంటి నిర్దిష్ట కారణం లేకుండా కడుపు ఉబ్బినట్లు లేదా నిరంతరం కడుపు ఉబ్బినట్లు అనిపిస్తే.. అది అండాశయ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. చాలా మంది మహిళలు దీనిని గ్యాస్ లేదా జీర్ణ సమస్యగా భావించి విస్మరిస్తారు. అయితే ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే.. వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
కటి లేదా కడుపు నొప్పి అండాశయ క్యాన్సర్ సాధారణ లక్షణం నిరంతర నొప్పి లేదా పొత్తి కడుపు లేదా కటి ప్రాంతంలో భారంగా అనిపించడం. ఈ నొప్పి ఋతు నొప్పికి భిన్నంగా ఉంటుంది. కాలక్రమేణా పెరుగుతుంది.
తినడం కష్టం లేదా త్వరగా కడుపు నిండినట్లు అనిపిస్తే కొంచెం తిన్నా వెంటనే కడుపు నిండినట్లు అనిపించినా లేదా ఆకలి తక్కువగా అనిపించినా ఈ లక్షణం ఆందోళన కలిగించేది అని వైద్యులు చెబుతున్నారు. అండాశయ క్యాన్సర్ కడుపుపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది తినగల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
తరచుగా మూత్రవిసర్జన ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా సరే తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంటే.. అది అండాశయ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. క్యాన్సర్ మూత్రాశయంపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల ఈ సమస్య వస్తుంది.
క్రమరహిత ఋతుస్రావం లేదా యోని నుంచి రక్తస్రావం రుతువిరతి తర్వాత యోని రక్తస్రావం లేదా క్రమరహిత ఋతుస్రావం ఉంటే.. అది అండాశయ క్యాన్సర్ లక్షణం కావచ్చు. అయితే కొంత మంది మహిళలకు ఈ సమస్య ఇతర హార్మోన్ల సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. అయినా సరే ఈ సమస్య తలెత్తితే నిర్లక్షం వద్దు.
అండాశయ క్యాన్సర్ లక్షణాలు సాధారణ సమస్యలుగా అనిపిస్తాయి. కనుక చాలా మంది మహిళలు తరచుగా వీటిని విస్మరిస్తారు. ఎవరికైనా ఈ లక్షణాలు రెండు-మూడు వారాల పాటు కొనసాగితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో రోగ నిర్ధారణ జరిగితే… వ్యాధి నివారణకు తగిన విధంగా చికిత్స తీసుకుంటే.. ఈ తీవ్రమైన వ్యాధిని ఓడించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








