Lord Shiva: ఇంట్లోని పూజ గదిలో శివలింగాన్ని ప్రతిష్టిస్తే.. పాటించాల్సిన నియమాలు ఇవే
మరో రెండు రోజుల్లో శ్రావణ మాసం రానుంది. ఈ నెల అంటే మహిళలకు చాలా ఇష్టం. నోములు, వ్రతాలు జరుపుకునే మాసం. అంతేకాదు శివ కేశవులవులను కూడా భక్తితో పూజించే నెల. అయితే కొంత మంది శివ భక్తులు శివాలయానికి బదులుగా తమ ఇంట్లోనే శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారు, అయితే శివ పూజకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

శ్రావణ మాసం శివుని పూజకు చాలా ప్రయోజనకరమైనది. ప్రతి ఒక్కరూ శివుడిని పూజిస్తారు. జలంతో అభిషేకం చేస్తారు. కొంతమంది ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టిస్తారు. అయితే ఇలా ప్రతిష్టించడానికి కూడా కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
శివుడు సృష్టి లయకారుడు. దేవతలకు దేవుడు అయినప్పటికీ.. కేవలం జలంతో అభిషేకం చేసినా చాలు త్వరగా సంతోషిస్తాడు. అయితే శివుడికి త్వరగా కోపం కూడా తెచ్చుకుంటాడు. శివుడికి అనుగ్రహం కలిగినా.. ఆగ్రహం వచ్చినా ఒకే విధంగా ఉందని పురాణాల కథనం. ఈ రోజు మనం ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించడానికి మన పురాణాలలో వివరించబడిన, ఇతర గ్రంథాలలో కూడా ప్రస్తావించబడిన నియమాల గురించి తెలుసుకుందాం..
ఇంట్లోని శివలింగం బొటనవేలు కంటే చిన్నగా ఉండాలి శివలింగాన్నిఇంట్లో పూజ గదిలో ప్రతిష్టించే ముందు.. శివలింగం పరిమాణం బొటనవేలు కంటే పెద్దదిగా ఉండకూడదు. ఎందుకంటే బొటన వేలు కంటే చిన్న శివ లింగాన్ని ప్రతిష్టించడం ఫలవంతం. శివ పురాణంలో కూడా ఈ విషయ ప్రస్తావన కనిపిస్తుంది.
ఏ దిశకు ఎదురుగా అభిషేకం చేయాలంటే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు.. మీ ముఖం ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉండాలి. దక్షిణం లేదా తూర్పు దిశకు ఎదురుగా అభిషేకం చేయడం శుభప్రదం కాదు.
శివలింగం పొడిగా ఉండకూడదు ఇంట్లో పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర శివలింగాన్ని ప్రతిష్టిస్తే.. ఆ శివలింగం ఎండిపోకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రతిరోజూ శివలింగానికి నీటిని సమర్పించాలి. శివలింగానికి జల అభిషేకం కోసం జలధారిని ఏర్పాటు చేయడం శుభప్రదం.
ఏ శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్టించండిచాలంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుంటే పరద శివలింగాన్ని ఉంచుకోవచ్చు లేదా నర్మదేశ శివలింగాన్ని కూడా ఉంచుకోవచ్చు. వీటిని పవిత్రమైనవిగా భావిస్తారు. వీటిని ఇంట్లో ఉంచడానికి తగినవిగా చెబుతారు.
పూజలు క్రమం తప్పకుండా చేయాలి ఇంట్లో ఉంచుకున్న శివలింగాన్ని ప్రతిరోజూ పూజించాలి. దానికి ప్రతిరోజూ నీరు సమర్పించాలి.
ఏ పాత్రలను ఉపయోగించవద్దు ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి ఉంటే.. ప్లాస్టిక్ లేదా స్టీల్ పాత్రను ఉపయోగించి శివ లింగానికి జలాభిషేకం చేయకూడదు. ఎల్లప్పుడూ రాగి లేదా ఇత్తడి పాత్రను ఉపయోగించి నీటిని సమర్పించాలి.
తనయులతో శివ పార్వతుల ఫోటో మీరు ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించినట్లయితే.. తప్పని సరిగా శివ కుటుంబం కూడా అక్కడ ఉండాలని మర్చిపోకండి. మీ పూజ గదిలో గణేశుడు, కార్తికేయుడి తో పాటు శివ పర్వతులున్న ఫోటో కూడా ఉండడం చాలా ముఖ్యం.
తులసి దళాలు సమర్పించవద్దు గుర్తుంచుకోండి ఇంట్లో శివుడిని పూజిస్తే.. పొరపాటున కూడా శివుడికి తులసి దళాలను సమర్పించవద్దు, తులసి శివుని పూజలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది.
కుండలో నీళ్లు పోయాలి శివుడికి సమర్పించిన నీటిని సేకరించి ఒక కుండలో వేయండి. ఈ నీటిని ఎప్పుడూ పారవేయకండి లేదా దానిని పారబోయకండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








