Shani Mahadasha: ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే శని మహాదశ జరుగుతున్నట్లు.. ఈ పరిహారాలు చేయడం ఫలవంతం..
వేద జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన కాలం శని మహాదశ, లేదా శని ప్రధాన దశ. ఇది శనిశ్వరుని శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకనే శని మహాదశ పేరు వినగానే ప్రజలు భయపడతారు. ఈ సమయం చాలా బాధాకరమైనది. ప్రజలు 19 ఏళ్ళు దీని ప్రభావాన్ని భరించాల్సి ఉంటుంది. శని మహాదశలో వ్యక్తులు వారి కెరీర్, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత సంబంధాలలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే ఇది వ్యక్తి జాతకం, శని స్థానంపై ఆధారపడి ఉంటుంది. శని మహాదశ అంటే ఏమిటి ? దాని ప్రభావం ఏమిటో తెలుసుకుందాం.

శని మహాదశ చాలా బాధాకరమైనది. న్యాయ దేవుడు అయిన శనీశ్వరుడు వ్యక్తుల కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. అయితే మనం శని మహాదశ గురించి మాట్లాడుకుంటే అది 19 సంవత్సరాలు ఉంటుంది. శని మహాదశ ప్రభావం వ్యక్తి జాతకంలో శని స్థానం, ఇతర గ్రహాలు, వివిధ గృహాలతో దాని కలయికపై ఆధారపడి ఉంటుంది.
ఎవరైనా శని మహాదశ ప్రభావంలో ఉంటే వారి జీవితంలో అనేక రకాల సమస్యలు, అడ్డంకులు, సంఘర్షణలు, అశాంతి, మానసిక ఒత్తిడి, సమస్యలు తలెత్తవచ్చు. శని మహాదశకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, దాని ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలను వివరంగా తెలుసుకుందాం.
శని మహాదశ ఎప్పుడు ఇబ్బందికరంగా మారుతుంది? శని మహాదశతో పాటు ఏలినాటి శని, శని ధైయాలు ఉన్నప్పుడు శని మహాదశ ఇబ్బందికరంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో వ్యక్తి ఇబ్బందులతో పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
శని మహాదశ లక్షణాలు
- శని మహాదశ ఎవరిపైన అయినా ఉంటే.. మీరు మీ విలువైన వస్తువులను పదేపదే కోల్పోయే అవకాశం ఉంది. దాని కారణంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.
- శని మహాదశ కారణంగా మీరు మీ చెడు అలవాట్లను వదులుకోవడంలో విఫలం కావచ్చు.
- శని మహాదశ కారణంగా ఇంట్లో ఎల్లప్పుడూ సంఘర్షణ, కలహాలు, వివాదాల పరిస్థితి ఉంటుంది. ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన తగాదాలు లేదా వాదనలు జరిగే పరిస్థితి ఉంటుంది.
శని మహాదశ సమయంలో ఈ పరిహారం చేయండి
- ఎవరైనా శని మహాదశలో ఉంటే వారు ప్రతి శనివారం శని చాలీసా పారాయణం చేయాలి. శని ఆలయంలో శనీశ్వరుడికి హారతి ఇవ్వండి.
- ప్రతి శనివారం శని ఆలయాన్ని సందర్శించి శనీశ్వరుడికి నువ్వుల నూనెను సమర్పించండి.
- శనీశ్వరుడితో పాటు హనుమంతుడిని పూజించండి. ఇలా చేయడం ద్వారా శనీశ్వరుడితో పాటు హనుమంతుడి ఆశీస్సులను పొందుతారు.
- శని మహాదశ సమయంలో చెడు ఆలోచనలు చేయవద్దు. ఎవరికీ చెడు జరగాలని కోరుకోకండి. ఎవరికీ చెడు చేయకండి. ఎందుకంటే కర్మ దేవుడు శని దేవుడు కర్మ ప్రకారం ఫలితాలను ఇస్తాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.