Puri Jagannath: జగన్నాథునికి 56 రకాల భోగాలతో పాటు వేప పొడిని నైవేద్యంలో ఎందుకు పెడతారో తెలుసా..
జగన్నాథుడు అంటే ప్రపంచ ప్రభువు. భక్తులకు జగన్నాథుడే సర్వస్వం. తల్లి, తండ్రి, హితుడు, స్నేహితుడు ఇలా అన్నీ జగన్నాథుడే అని భక్తులకు విశ్వాసం. పిలిస్తే దైవం అని నమ్మకం. భగవంతునికి, భక్తునికి మధ్య పవిత్ర సంబంధం గురించి తెలియజేసే అనేక రూపాలున్నాయి. ఇందుకు సంబంధించిన అనేక కథలు ఉన్నాయి., అలాంటి ఒక కథ పూరి జగన్నాథుడికి సంబంధించినది. జగన్నాథుడు భోజన ప్రియుడు. రకరకాల ఆహరం పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు.. వేప పొడిని కూడా పెడతారని తెలుసా..

హిందువుల పవిత్ర క్షేత్రం చార్ ధామ్ లో ఒకటి పూరీ. ఇక్కడ జగన్నాథ స్వామి తన అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు. జగన్నాథుడు భోజన ప్రియుడు. అందుకనే ఆయన వంటగది 24 గంటలు పనిచేస్తునే ఉంటుంది. స్వామికి రోజులో నైవేద్యంగా సమర్పించేందుకు 56 రకాల ఆహార పదార్ధాలను వండుతారు. స్వామి దర్శనం కోసం వెళ్ళిన భక్తులు ఎవరూ ఆకలితో తిరిగి రారు. అసలు ఆకలి అన్న పదం అక్కడ వినిపించదు అని అంటారు. రోజంతా 56 వంటకాలను భగవంతుడికి నైవేద్యం పెడతారు. వాటిని తిరిగి భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ వంటగదిలో ఎప్పుడూ ఆహారం అయిపోదు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది.
వేప పొడి ఎందుకు ఇస్తారు?
జగన్నాథుడికి ఈ యాభై ఆరు నైవేద్యాలతో పాటు వేప పొడిని కూడా ప్రసాదాల మధ్య పెడతారాని మీకు తెలుసా? ఇలా ఎందుకు చేస్తారో తెలిస్తే భక్తులు, సామాన్యులు ఆశ్చర్యపోతారు. భగవంతుడికి ఇంత చేదు వేప పొడిని పెడతారో తెలుసా.. రకరకాల ఆహార పదార్ధాలతో పాటు చేదు కలిగిన వేప పొడిని ఎందుకు నైవేద్యంగా పెడతారు.. దీని వెనుక ఉన్న కథను గురించి తెలుసుకుందాం..
దీని వెనుక ఉన్న కథ ఏమిటి?
ఒకప్పుడు పూరి జగన్నాథ గ్రామంలో నివసించే ఒక వృద్ధ మహిళ. జగన్నాథుడికి ప్రతిరోజూ 56 రకాల నైవేద్యాలను సమర్పించడం, తినడం చూసేది. ఒక రోజు ఆమె తన కొడుకు జగన్నాథుడు చాలా నైవేద్యాలు తింటున్నాడని అనుకుంది. కనుక అతనికి కడుపు నొప్పి రావచ్చు. ఇలా ఆలోచిస్తూ.. ఒక రోజు ఆమె తన ఇంటి నుంచి వేప పొడిని తయారు చేసి జగన్నాథుని కోసం తీసుకువచ్చింది. అయితే అక్కడ ఆలయ ద్వారపాలకుడు ఆ వృద్ధురాలిని ఆలయ లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు. భక్తితో తెచ్చిన ఆ వేప పొడిని పారవేశాడు.
ఆ రాత్రి పూరి రాజు కలలో జగన్నాథుడు కనిపించి.. తన భక్తురాలు ఒక తల్లి తన కోసం చాలా ప్రేమతో వేప పొడి తెచ్చిందని.. అయితే ఆలయ ద్వారపాలకులు ఆమెను లోపలికి రానివ్వలేదని చెప్పాడు. మరుసటి రోజు రాజు తన కలను వివరించి.. స్వయంగా ఆ తల్లి ఇంటికి వెళ్లి అదే వేప పొడిని తయారు చేయమని కోరాడు. ఆ వృద్ధ తల్లి మళ్ళీ తన కొడుకు జగన్నాథుడికి వేప పొడిని తయారు చేసి అతనికి ఇచ్చింది. అప్పటి నుంచి మొదలైన ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. జగన్నాథుడికి వివిధ ఆహారాలతో పాటు వేప పొడిని నైవేద్యంగా తినిపిస్తారు. మన దేశంలో భక్తుడికి, దేవునికి మధ్య ఉన్న సంబంధం, భగవంతునికి, భక్తునికి మధ్య ఉన్న విశ్వాసానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.