- Telugu News Photo Gallery Spiritual photos saturday puja tips: do not bring these things home on saturday know the details
Saturday Puja Tips: శనివారం రోజున ఈ వస్తువులు కొంటున్నారా.. ఆర్ధిక పరిస్థతి దిగజారిపోవచ్చు జాగ్రత్త సుమా..
హిందూ ధర్మంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఈ నేపధ్యంలో శనివారం న్యాయ దేవుడు అయిన శనీశ్వరుడికి అంకితం చేయబడింది. కర్మ ఫలదాత అనుగ్రహం కోసం శనీశ్వరుడికి ఇష్టం లేని పను చేయవద్దు. ఇష్టం లేనివి కొనవద్దు. శనివారం పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనడం శుభప్రదం కాదు. ఈ వస్తువులను కొనడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రోజు శనివారం ఇంటికి తీసుకురావకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
Updated on: Jun 14, 2025 | 6:46 AM

శనీశ్వరుడిని పూజించడానికి శనివారం ఉత్తమ రోజుగా పరిగణించబడుతుంది. శనివారం శనీశ్వరుడికి సంబంధించిన వస్తువులను కొనడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. శనివారం ఏ వస్తువులను కొనకూడదో తెలుసుకుందాం. శనివారం వస్తువులను కొనడం వల్ల శనీశ్వరుడి చెడు దృష్టిని ఎదుర్కోవాల్సి వస్తుందని .. కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు.

శనివారం పొరపాటున కూడా నువ్వుల నూనె, ఆవ నూనె మాత్రమే కాదు నూనే అన్న వస్తువుని కొనకూడదని నమ్మకం. శనివారం రోజున వంట నూనె కొనడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే శనివారం చీపురు కొనకూడదు. మీరు చీపురు కొనాలనుకుంటే శుక్రవారం దానికి శుభప్రదమైన రోజు. శనివారం చీపురు కొనడం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.

శనివారం రోజున ఉప్పు కొనకూడదు.ఉప్పుని ఇంటికి తీసుకురావద్దు. శనివారం ఉప్పు కొనడం వల్ల అప్పులు పెరుగుతాయి. శని దేవుని ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. మీరు ఉప్పు కొనాలనుకుంటే శుక్రవారం రోజున కొనడం శుభప్రదం.

శనివారం రోజున నల్ల నువ్వులు, మినపప్పు కొనకూడదు. నల్ల నువ్వులను, మినపప్పుని ఇంటిలోకి తీసుకురావద్దు. ఇలా చేయడం వల్ల మీ ముఖ్యమైన పని ఆలస్యం కావచ్చు. దీని వలన మీరు కలత చెందవచ్చు. అయితే శనిశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం రోజున నల్ల నువ్వులు, నల్ల మినపప్పును సమర్పిస్తారు. లేదా దానం చేయడం శుభప్రదం.

శనివారం రోజున పొరపాటున కూడా ఇనుము, ఇనుప వస్తువులు కొనకూడదు. శనివారం ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను కొనడం దురదృష్టాన్ని తెస్తుంది. ఈ రోజున ఇనుము కొనడం వల్ల శనీశ్వరుడికి ఆగ్రహం కలుగుతుంది.

శనివారం రోజున కత్తెర, కత్తి చాకు వంటి పదునైన వస్తువులు కొనకూడదు. అలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలలో సమస్యలు వస్తాయి. శనిశ్వర ఆగ్రహంతో మీరు సంబంధాలలో ఉద్రిక్తత, ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.




