Chanakya Niti: దానం చేయడానికి కొన్ని నియమాలున్నాయి.. ఇలాంటి వారికి అస్సలు దానం చేయకూడదు.. ఎందుకంటే
ఆచార్య చాణక్యుడు తక్షశిల అధ్యాకుడు. రాజనీతజ్ఞుడు. చాణక్య విష్ణుశర్మ పేరుతో పంచతంత్రము, కౌటిల్యుని పేరుతో అర్థ శాస్త్రము, చాణక్యుని పేరుతో చాణక్య నీతి రచించాడు. వీటిని నేటికీ ఆచరించడం వలన . రాజనీతిజ్ఞులుగా, తెలివైన వారుగా, విలువల ఉన్న జీవితాన్ని అందుకుంటారు. చాణక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్న జీవన విధానంలో దానం చేయడం కూడా ఒకటి. అయితే దానం చేసే సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని పేర్కొన్నాడు.

ఆచార్య చాణక్యుడు మనిషి జీవితానికి ఉపయోగపడే విధి విధానాలను అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. వాటిని నేటికీ అనుసరణీయం అని చెబుతారు. తన నీతి శాస్త్రంలో మనిషి జీవితంలో ప్రేమ, పెళ్లి, నమ్మకం, స్నేహం, మోసం, దానం , పాపం, పుణ్యం వంటి అనేక విషయాలున్నాయి. అందులో ఒకటి దానం చేసే విధానం గురించి చాణక్య పేర్కొన్నాడు. అవును దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది. అయితే దానం చేసే పద్దతిలో తప్పు ఉంటే అది అనేక ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. కనుక దానం చేసే సమయంలో కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. అవి ఏమిటంటే..
ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దానం చేయాలి కొంతమంది తమ శక్తి కొలది ఆపన్నులకు, పేదలకు తరచుగా దానం చేస్తుంటారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం దానం చేయడం మంచి పనే.. అయితే అది ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దానం చేయడం మంచిది. గొప్పకు పోయి తప్పుడు పద్ధతిలో చేసే దానం మీకు మంచిది కాదు.
ఆలోచించి దానం చేయాలి కొంతమంది దానం తమ ఆర్దిక పరిస్థితిని బట్టికాకుండా భావోద్వేగాలకు లోనై దానం చేస్తారు. ఇలా చేయడం వలన దానం చేసేవారు ఇబ్బందుల్లో పడతారని ఆచార్య చాణక్య చెప్పాడు. కనుక దానం చేసే ముందు అలోచించి చేసే దానం పక్కదారి పట్టదు అని నిర్ణయించుకోవడం మంచిదని పేర్కొన్నాడు.
జేబు ఖాళీ చేసుకుని మరీ దానం చేయద్దు దానం చేయడం పుణ్యప్రదం అని కనుక ఎంత ఎక్కువ దానం చేస్తే అంత తిరిగి ఏదోవిధంగా వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే చాణక్యుడు చెప్పిన ప్రకారం ఇలా తన ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా ముందు వెనుక చూడకుండా దానం చేసేవారు భవిష్యత్ లో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కనుక తమ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దానం చేయడం ఉత్తమం.
పాత్ర ఎరిగి దానం చాణక్య నీతి ప్రకారం డబ్బులను ఎలా నిర్వహించాలో తెలియని వారికి అంటే అనర్హులకు దానం చేయడం మంచిది కాదు. తమని తామే పోషించుకోలేని వ్యక్తులకు ఆవును దానం చేయడం వలన అది నిరుపయోగం. ఎందుకంటే అతనికే తినడానికి తిండి లేదు.. ఇక ఆవుకి ఏమి ఆహరం పెడతాడు. కనుక పాత్ర ఎరిగి దానం చేయాలి.
కృతజ్ఞత లేని వ్యక్తులకు దానం వద్దు
చేసిన సాయం,చేసి మేలుని మరచి కృతజ్ఞత లేని వ్యక్తులకు దానం చేయడం వలన పుణ్యం రాదు సరికదా.. మీకే అనేక ఇబ్బందులు వస్తాయి. మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కోవడం వంటిది అని చాణక్య చెప్పాడు.
గొప్ప కోసం దానం చేయవద్దు ఎవరికైనా అవసరానికి మించి దానం చేయడం తప్పు.. మీరు దానం చేయడం వలన మీరు బలహీన పడరాదు. అంతేకాదు గొప్పల కోసం గొప్ప పేరు కోసం దానం చేయడ వలన దానం చేసిన ఫలం దక్కదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








