Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు క్లీన్‌ చేస్తున్నారా..? వాస్తు ఏం చెబుతుందో తెలిస్తే..

ఈ సమయం ప్రతికూల శక్తుల సంచితంతో ముడిపడి ఉంటుంది . ఈ సమయంలో ఇల్లు తుడిస్తే.. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇంటిని తుడిచే విధానంలో ఎప్పుడూ ప్రధాన ద్వారం దగ్గర తుడుచుకోవడం ప్రారంభించి, అదే స్థలంలో ముగించండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఇంట్లోకి రాకుండా ఉంటుందట.

ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు క్లీన్‌ చేస్తున్నారా..? వాస్తు ఏం చెబుతుందో తెలిస్తే..
Rules For Mopping
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 30, 2024 | 10:08 PM

సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగానే ఉంచుకుంటారు. ఇల్లు ఊడవటం, తుడవటం లాంటివి చేస్తారు. కానీ.. వాటిని ఏ సమయంలో చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రం చేసే విధానానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. వాస్తుశాస్త్రంలో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లోని దుమ్ము, ధూళిని తొలగించడమే కాదు.. ప్రతికూల శక్తి , వైబ్రేషన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. శుభ్రమైన , చక్కగా ఉంచుకునే ఇల్లు, ఆ ఇంట్లోని వారికి ఆరోగ్యం, సంపద , ఆనందాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే వాస్తు శాస్త్రంలో రెగ్యులర్ గా ఇల్లు తుడుచుకోవడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

వాస్తు ప్రకారం ఇంటిని తుడుచుకోవడానికి ఉత్తమ సమయం బ్రహ్మ ముహూర్తంగా పరిగణిస్తారు. ఇది సూర్యోదయానికి ముందు కాలం. సూర్యోదయానికి గంటన్నర ముందుగానే ఇల్లు, ఇంటి పరిసరాలను శుభ్రం చేయటం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. రోజంతా ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తుందని చెబుతున్నారు. సూర్యోదయం సమయానికి పరిసరాలను శుభ్రం చేసుకోవటం కూడా ఇంటి పురోగతికి ప్రయోజనకరం. ఇలా చేయటం అనేది చీకటి నుండి కాంతికి పరివర్తనకు ప్రతీకగా పరిగణిస్తారు. ఇది ప్రతికూలత తొలగింపుకు, సానుకూల శక్తి రాకను సూచిస్తుంది. మీరు ఈ సమయంలో ఇంటిని తుడుచుకోవటం, పరిసరాలను శుభ్రం చేసుకోవటం వల్ల మీ మొత్తం ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

అలాగే, వాస్తు శాస్త్రం ప్రకారం, పట్టపగలు సమయంలో ఇంటిని తుడుచుకోవడం మంచి పద్ధతి కాదు. ఇలా చేయటం సరైనది కాదంటున్నారు. మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడని, ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేయడం కాకుండా ఇతర కార్యకలాపాలకు సరైనదని నమ్ముతారు. ఈ సమయంలో మీరు ఇళ్లు తుడుచుకోవటం వల్ల ఇంట్లోకి వచ్చే సౌరశక్తి పూర్తి ప్రయోజనం పొందలేరు. అలాగే, ఇంటిని తుడుచుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే సంతోషం ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. మీరు తుడుచుకున్నప్పుడల్లా, ఇంటి ప్రవేశ ద్వారం నుండి ప్రారంభించండి.

ఇవి కూడా చదవండి

అంతేకాదు..ఇంటిని శుభ్రం చేసే విషయంలో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది.. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు తుడవకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ సమయం ప్రతికూల శక్తుల సంచితంతో ముడిపడి ఉంటుంది . ఈ సమయంలో ఇల్లు తుడిస్తే.. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇంటిని తుడిచే విధానంలో ఎప్పుడూ ప్రధాన ద్వారం దగ్గర తుడుచుకోవడం ప్రారంభించి, అదే స్థలంలో ముగించండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే ఇంట్లోకి రాకుండా ఉంటుందట.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..