Health Benefits : అంజీర్ ఎప్పుడు తినాలి. ఉదయమా? సాయంత్రమా ? దీనితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..!
అంజీర్.. వీటినే అత్తిపండ్లు అని కూడా అంటారు. డైఫ్రూట్స్ రూపంలోనూ లభించే అంజీర్ మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. తినడానికి రుచిగా ఉండడమే కాదు.. అద్భుతమైన పోషకాలు కూడా అంజీర్‌లో ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలను బలపరిచేందుకు సహాయపడతాయి. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే, పోషకాల నిధిగా పిలిచే అంజీర్ ఎప్పుడు తినాలి అనే సందేహం చాలా మంది వ్యక్తం చేస్తుంటారు. దీనిని ఉదయం తినాలా.. లేదంటే సాయంత్రం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..