- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: Glenn Maxwell Unfollows Royal Challengers Bangalore Instagram Ahead Of Mega Auction
IPL 2025: బాంబ్ పేల్చిన RCB.. మెగా వేలానికి ముందే కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్‌కు హ్యాండిచ్చారుగా
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2025) మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసినట్టు తెలుస్తోంది. ఆ టీం నుంచి గ్లెన్ మాక్స్‌వెల్‌ను తొలగించడం దాదాపుగా ఖాయమైంది.
Updated on: Jul 30, 2024 | 7:50 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2025) మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసినట్టు తెలుస్తోంది. ఆ టీం నుంచి గ్లెన్ మాక్స్‌వెల్‌ను తొలగించడం దాదాపుగా ఖాయమైంది. ఇక ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తూ.. మాక్స్‌వెల్ ఇటీవల సోషల్ మీడియాలో ఆర్‌సీబీని అన్‌ఫాలో చేశాడు.

గత మూడు సీజన్లలో ఆర్‌సీబీ జట్టుతోనే కొనసాగిన గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ ఫ్రాంచైజీల సమావేశానికి ముందు ఆర్‌సీబీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అన్‌ఫాలో చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఆర్సీబీ మ్యాక్స్‌వెల్‌పై వేటు వేయడం ఖరారుగా కనిపిస్తోంది.

ఆర్‌సీబీ ఫ్రాంచైజీ 2021 వేలంలో గ్లెన్ మాక్స్‌వెల్‌ను రూ. 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీని తర్వాత, 2022 మెగా వేలానికి ముందు, అతన్ని 11 కోట్ల రూపాయలకు కొనుగోలు రిటైన్ చేసుకుంది. అయితే ఈసారి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ను నిలబెట్టుకునే అవకాశం లేదు.

ఎందుకంటే గత సీజన్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ ఆశించినంతగా రాణించలేదు. టోర్నమెంట్ అంతటా లెక్కేసుకుంటే కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. అంటే 10 మ్యాచుల్లో మ్యాక్సీ 5.78 సగటుతో 52 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు ఒకే సీజన్‌లో 5 సార్లు డకౌట్ అయ్యాడు. అందుకే మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ వదులుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

ఆర్‌సీబీ తరపున గ్లెన్ మాక్స్‌వెల్ 52 మ్యాచ్‌ల్లో 1266 పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అటు బంతితో మ్యాక్సీ మొత్తం 18 వికెట్లు తీశాడు. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఈసారి ఐపీఎల్ మెగా వేలానికి ముందు మాక్స్‌వెల్‌ను విడుదల చేసి, ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.




