AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver Diet: ఫ్యాటీ లివర్‌ ఎంత డేంజరో తెలుసా? ఈ ఆహారాలను అస్సలు ముట్టుకోకూడదు

నిత్యం మద్యపానం, రోజు బయటి ఆహారం తినడం, క్రమరహిత జీవనశైలి వంటి అలవాట్ల వల్ల ఒంట్లో అనేక వ్యాధులు తిష్టవేస్తాయి. అందులో ఫ్యాటీ లివర్ సమస్య ఒకటి. AIIMS సర్వే నివేదిక ప్రకారం.. నేడు భారతదేశంలోని మొత్తం జనాభాలో మూడింట ఒక వంతు మంది అంటే 38 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయిందని అర్థం..

Srilakshmi C
|

Updated on: Jul 30, 2024 | 8:36 PM

Share
నిత్యం మద్యపానం, రోజు బయటి ఆహారం తినడం, క్రమరహిత జీవనశైలి వంటి అలవాట్ల వల్ల ఒంట్లో అనేక వ్యాధులు తిష్టవేస్తాయి. అందులో ఫ్యాటీ లివర్ సమస్య ఒకటి. AIIMS సర్వే నివేదిక ప్రకారం.. నేడు భారతదేశంలోని మొత్తం జనాభాలో మూడింట ఒక వంతు మంది అంటే 38 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్ అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోయిందని అర్థం.

1 / 5
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఎక్కువగా ఆల్కహాల్‌ తాగడం వల్ల వస్తుంది. పేలవమైన జీవనశైలి, జంక్ ఫుడ్ వల్ల నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుంది. ఈ రెండు సందర్భాల్లోనూ లివర్‌ ప్రభావితమైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాటీ లివర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు నివారించవలసిన కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ముందుగా ఆల్కహాల్‌ తీసుకోవడం పూర్తిగా మానేయాలి.

2 / 5
డయాబెటిస్‌ మాదిరిగానే, చక్కెర కూడా కొవ్వు కాలేయానికి శత్రువు. చక్కెర ఉన్న ఆహారాన్ని తినడం మానుకోవాలి. కేకులు, కుకీలు, స్వీట్లు, టీతో సహా చక్కెరకు సంబంధించిన అన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉప్పగా లేదా వేయించిన ఆహారంతో కూడా ఫ్యాటీ లివర్‌కు ప్రమాదమే. పకోడీలు, చాప్స్, కట్‌లెట్‌ల నుండి ఇతర నూనె-మసాలా ఆహారాల వరకు, రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వరకు అన్నింటికీ దూరంగా ఉండాలి.

3 / 5
మరైతే ఏం తినాలని అనుకుంటున్నారా? కాలానుగుణ వచ్చే కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. అలాగే బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి గింజలను తినవచ్చు. ఫ్యాటీ లివర్‌కి ఏ రకమైన పప్పు అయినా మంచిదే. పప్పులో కూరగాయల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఆహారంలో చియా విత్తనాలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలను చేర్చుకోవచ్చు.

4 / 5
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు రెడ్ మీట్ తినకూడదు. బదులుగా చేపలు, చికెన్ తినవచ్చు. చికెన్‌లో లీన్ ప్రొటీన్ ఉంటుంది. చేపలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లకు మూలం. ఇది కొవ్వు కాలేయంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5 / 5