Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వేం మనిషివిరా బాబు.. మనిషి ప్రాణం పోతుంటే.. కూల్‌డ్రింక్స్‌ చోరీ చేస్తున్నావ్‌..! వీడియో వైరల్‌..

ఆ ట్రక్కు కూల్‌డ్రింక్స్‌ బాటిల్స్ లోడ్‌ తో వెళ్తోంది. ప్రమాదం జరగడంతో కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌ అన్నీ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. అంతలో ఓ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుకుంటూ వచ్చి ఆ బాటిల్స్ లోంచి ఒక పెద్ద ప్యాకెట్‌ తీసుకుని వెళ్లిపోయాడు. అక్కడ ఎవరికైనా సహాయం కావాలా అని ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఈ వీడియో ఘజియాబాద్‌లోని లాల్ కువాన్ హైవేపై జరిగిన ఘటనగా తెలిసింది.

నువ్వేం మనిషివిరా బాబు.. మనిషి ప్రాణం పోతుంటే.. కూల్‌డ్రింక్స్‌ చోరీ చేస్తున్నావ్‌..! వీడియో వైరల్‌..
Ghaziabad Truck Accident
Jyothi Gadda
|

Updated on: Jul 30, 2024 | 9:13 PM

Share

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు సమాజంలోని నిజాలను బట్టబయలు చేస్తున్నాయి. మనుషులు ఎంత మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారో ఇలాంటి వీడియోలు చూపిస్తున్నాయి. ఎవరికైనా సహాయం చేయాలంటే.. ముందుగా ప్రజలు తమ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక ట్రక్కు ప్రమాదానికి గురైంది. కానీ, అక్కడి స్థానికులు అందులో ఉన్నవారికి సహాయం చేయడానికి బదులుగా చెల్లాచెదురుగా పడిపోయిన ఆ ట్రక్కులోని వస్తువులను ఎత్తుకెళ్లే పనిలో పడ్డారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియోలో ట్రక్కు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. దాంతో ట్రక్కు బోల్తా పడిపంది. అందులోని వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఆ ట్రక్కు కూల్‌డ్రింక్స్‌ బాటిల్స్ లోడ్‌ తో వెళ్తోంది. ప్రమాదం జరగడంతో కూల్‌డ్రింక్‌ బాటిల్స్‌ అన్నీ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. అంతలో ఓ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుకుంటూ వచ్చి ఆ బాటిల్స్ లోంచి ఒక పెద్ద ప్యాకెట్‌ తీసుకుని వెళ్లిపోయాడు. అక్కడ ఎవరికైనా సహాయం కావాలా అని ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఈ వీడియో ఘజియాబాద్‌లోని లాల్ కువాన్ హైవేపై జరిగిన ఘటనగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్‌గా మారడంతో జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇలాంటి ఆపదలో కూడా అవకాశాలు వెత్తుక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు స్పందిస్తూ మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోయిందని కామెంట్‌ చేశారు. కష్ట సమయాల్లో కూడా సాటి మనిషికి సాయం చేసేందుకు.. తమ ప్రయోజనాల కోసం చూస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. @gharkekalesh అనే X ఖాత ద్వారా ఈ వీడియో షేర్‌ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియోపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..