దేవ భూమిలో..జల ప్రళయం.. ఏటా ఎందుకిలా..? నిపుణులేం చెబుతున్నారు..?
మళ్లీ... మళ్లీ... అదే విధ్వంసం.. అదే విషాదం.. దేవభూమిగా పేరున్న అందాల కేరళలో ప్రతి ఏటా జులై, ఆగస్టు నెలలు వస్తే చాలు... ప్రజలే కాదు.. ప్రభుత్వాలు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందా...? అని అనుక్షణం టెన్షన్‌తో వణికిపోతుంటాయి. ఏటా వచ్చే రుతుపవనాలు... కేవలం వర్షాలను మాత్రమే కురిపించి ఆగిపోవడం లేదు. విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.

మళ్లీ… మళ్లీ… అదే విధ్వంసం.. అదే విషాదం.. దేవభూమిగా పేరున్న అందాల కేరళలో ప్రతి ఏటా జులై, ఆగస్టు నెలలు వస్తే చాలు… ప్రజలే కాదు.. ప్రభుత్వాలు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందా…? అని అనుక్షణం టెన్షన్‌తో వణికిపోతుంటాయి. ఏటా వచ్చే రుతుపవనాలు… కేవలం వర్షాలను మాత్రమే కురిపించి ఆగిపోవడం లేదు. విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 2015 నుంచి 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు 3 వేల 782 జరిగితే అందులో కేరళలోనే అత్యధికంగా జరిగాయన్నది పార్లమెంట్ సాక్షిగా 2022లో నాటి కేంద్ర భూగర్భ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించిన వాస్తవం. కేరళ కన్నీరు తాజాగా మరోసారి వయనాడ్‌లో జిల్లాలో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంతో కేరళ తీవ్రంగా తల్లడిల్లిపోతోంది. అందాల టీ తోటలకు, పచ్చని ప్రకృతికి పేరున్న వయనాడ్ ఇప్పుడు వరదలధాటికి భయానకంగా మారింది. ముఖ్యంగా వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, చురామల, మందక్కాయి, అట్టమల, నులుప్పుజ పరిసర ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండచరియలు వందలాది కుటుంబాలలో విషాదం నింపాయి. మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉండటం స్థానిక నదులు ఉప్పొంగుతున్నాయి. నీటిలో కొట్టుకొస్తున్న మృత దేహాల్లో తమ వారున్నారేమో అన్న భయం, ఆందోళన స్థానికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏటా జరుగుతున్న ఈ విధ్వంసానికి ఇప్పటికే కొన్ని కళ్లు అలవాటుపడిపోయినా… తమ కళ్ల ముందే తమ రక్తసంబంధీకులు, స్నేహితులు...