AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రండి బాబూ రండి.! ఓన్లీ ఫర్ సింగిల్స్.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు రూ. 110.. ఎక్కడంటారా

సింగిల్స్ కోసం ఓ వినూత్న ఆఫర్ వచ్చేసింది.. ఇది సాదాసీదా ఆఫర్ కాదండోయ్.. కిర్రాక్ ఆఫర్.. కేవలం ఒంటరిగా ఉన్న అబ్బాయిల కోసమే ఇది.. అలాంటివారి కోసం అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇండియాలో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఈ చిత్రవిచిత్రమైన ఆఫర్ వాడుకలో..

Viral: రండి బాబూ రండి.! ఓన్లీ ఫర్ సింగిల్స్.. హాగ్‌కు రూ. 11, ముద్దుకు రూ. 110.. ఎక్కడంటారా
Viral
Ravi Kiran
|

Updated on: Jul 30, 2024 | 8:43 PM

Share

సింగిల్స్ కోసం ఓ వినూత్న ఆఫర్ వచ్చేసింది.. ఇది సాదాసీదా ఆఫర్ కాదండోయ్.. కిర్రాక్ ఆఫర్.. కేవలం ఒంటరిగా ఉన్న అబ్బాయిల కోసమే ఇది.. అలాంటివారి కోసం అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇండియాలో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఈ చిత్రవిచిత్రమైన ఆఫర్ వాడుకలో ఉన్నది చైనాలో.. అవునండీ.! ఇది నిజమే.. చైనాలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ ఊపందుకుంది, అక్కడ యువతులు వీధుల్లో స్టాళ్లు ఏర్పాటు చేసుకుని మరీ ‘లవ్ మీ ఇఫ్ యూ కెన్’ అంటున్నారు. ముఖ్యంగా ఇది సింగిల్స్ కుర్రాళ్ల కోసమట. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, చైనాలో స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ వేగంగా ఊపందుకుంది. సింగిల్స్ కుర్రాళ్లు ఈ ట్రెండ్‌కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారట. వారికి ఓ హాగ్, ఒక కిస్.. అంతేకాదు ఒక సినిమాకు వెళ్తున్నారట.. ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్స్. చైనాలోని షెన్‌జెన్ నగర వీధుల్లో ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ స్టాల్స్ ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఇక లోన్లీగా ఫీల్ అయ్యే సింగిల్ కుర్రాళ్లు వారి దగ్గరకు వస్తున్నారని అక్కడి స్థానికులు అంటున్నారు.

అయితే ఈ స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ సేవలకు కూడా ఛార్జ్ ఉంటుందట. కౌగిలింతకు 11 రూపాయలు(1 యువాన్), ముద్దుకు 110 రూపాయలు(10 యువాన్), సినిమా చూడటానికి రూ.150(15 యువాన్) చెల్లించాలని తెలుస్తోంది. అలాగే ఇంటికి తీసుకెళ్లి ఇద్దరూ కలిసి మద్యం సేవించాలంటే.. గంటకు రూ. 461(40 యువాన్) చెల్లించాలట. ఇక ఇప్పుడు ఈ చైనా స్ట్రీట్ గర్ల్‌ఫ్రెండ్ ప్రపంచమంతా హాట్ టాపిక్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.(Source)

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..