AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అక్క అతి తెలివికి హ్యాట్సాప్ .. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే అవాక్కే..!

బైక్‌ను కార్‌లా వాడేస్తారు మరికొందరు.. అలాంటి పని చేసిన ఓ మహిళ వాషింగ్ మెషీన్‌ను ఎలా వాడుతుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాషింగ్‌ మెషిన్‌ అంటే కేవలం బట్టలు మాత్రమే ఉతికేది కాదు.. ఇలా కూడా వాడొచ్చు అని నిరూపించింది. సదరు మహిళ వాషింగ్ మెషిన్‌ను వాడిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

Viral Video: అక్క అతి తెలివికి హ్యాట్సాప్ .. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే అవాక్కే..!
Woman cleaning dishes in washing machine
Jyothi Gadda
|

Updated on: Jul 30, 2024 | 6:08 PM

Share

మన దేశంలో ప్రతిభావంతులకు కొరత లేదు. ఇంటి పని, వంటపని ఏదైనా సరే.. మనవాళ్లు మనసు పెడితే.. మంత్రం వేసినట్టుగానే పూర్తి చేసేస్తారు.. పనిని మరింత సులువుగా మార్చేందుకు కొందరు ఊహకందని ట్రిక్స్‌ప్లే చేస్తుంటారు. కొందరు సైకిల్‌ని బైక్‌లా మార్చేస్తారు కొందరు. బైక్‌ను కార్‌లా వాడేస్తారు మరికొందరు.. అలాంటి పని చేసిన ఓ మహిళ వాషింగ్ మెషీన్‌ను ఎలా వాడుతుందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాషింగ్‌ మెషిన్‌ అంటే కేవలం బట్టలు మాత్రమే ఉతికేది కాదు.. ఇలా కూడా వాడొచ్చు అని నిరూపించింది. సదరు మహిళ వాషింగ్ మెషిన్‌ను వాడిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఒక మహిళ వాషింగ్ మెషిన్‌ను వాడే విధానం చూసిన ప్రజలు తెగ నవ్వుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా వాషింగ్‌మెషిన్‌ను బట్టలు ఉతికేందుకు ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్నఈ వీడియోలో ఓ మహిళ ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. వాషిన్‌మెషిన్‌ను ఓపెన్ చేసిన ఆమె.. ముందుగా అందులో నీళ్లు పోసింది. ఆ తరువాత అందులో లిక్విడ్ పోస్తుంది. ఆ తర్వాత ఏకంగా ఇంట్లోని వంట పాత్రలన్నీ అందులో పడేస్తుంది. ఫైనల్‌గా మిషిన్ ఆన్ చేయగా.. గిరాగిరా వేగంగా తిరిగి పాత్రలు క్లీన్ అవుతాయి. ఇలా బట్టలు ఉతకాల్సిన వాషింగ్‌ మెషిన్‌లో ఆమె వంట పాత్రలు వేసి శుభ్రం చేసింది. అంతేకాదు.. డ్రైయర్‌లో వేసి వాటిని ఆరబెట్టింది కూడా.. ఇక వీడియో చూసిన జనాలు.. ఈమె అతి తెలివి చూసి అవాక్కవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వాషింగ్‌మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసిందని కొందరు కామెంట్‌ చేయగా, అక్క అతి తెలివికి హ్యాట్సాప్ అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. చాలా ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. లక్షకు పైగా వ్యూస్‌, లైకులతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..