కూరలో కారం ఎక్కువైందా.. ఇలా చేయండి టేస్ట్‌ అదిరిపోతుంది..!

కొన్ని కొన్ని సార్లు కూరల్లో అనుకోకుండా కారం ఎక్కువవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి.. కూరలో కారం ఎక్కువైతే ఎలా తగ్గించాలి..? అనే భయం వెంటాడుతుంది.. అయితే, ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించ‌డం వల్ల కూర‌లో ఎక్కువైన కారాన్ని ఇట్టే తగ్గించేయొచ్చు. అదెలాగో చూసేయండి..

కూరలో కారం ఎక్కువైందా.. ఇలా చేయండి టేస్ట్‌ అదిరిపోతుంది..!
Chili Spice In Food
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 30, 2024 | 4:54 PM

ప్రతి ఒక్కరూ స్పైసీ ఫుడ్‌ అంటే ఇష్టంగా తింటారు. ఆహారం రుచి కోసం వివిధ రకాల మసాలాలతో పాటుగా ఎండుమిర్చి పౌడర్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని పెంచడానికి, మంచి రంగును అందిస్తుంది. ఉప్పు, కారం సరిగా ఉంటేనే ఆ కూర రుచి బాగుంటుంది. ఉప్పు, కారంలో ఏది తక్కువైనా, ఎక్కువైనా.. ఫుడ్‌ టేస్ట్‌ ఎంజాయ్‌ చెయ్యలేం. కూరలో ఉప్పు తక్కువైతే.. చూసుకుని మళ్లి వేసుకోవచ్చు. అది ఎక్కువైతే ఏం చేయాలో ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం.. అలాగే, కొన్ని కొన్ని సార్లు కూరల్లో అనుకోకుండా కారం ఎక్కువవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి.. కూరలో కారం ఎక్కువైతే ఎలా తగ్గించాలి..? అనే భయం వెంటాడుతుంది.. అయితే, ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించ‌డం వల్ల కూర‌లో ఎక్కువైన కారాన్ని ఇట్టే తగ్గించేయొచ్చు. అదెలాగో చూసేయండి..

పాల ఉత్పత్తులతో కారాన్ని తగ్గించుకోవచ్చు:

మీరు పప్పు, కూరలు చేస్తున్నప్పుడు పొరపాటున అందులో కారం ఎక్కువైతే.. దానిని తగ్గించడానికి మీరు పాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు కూరలో పెరుగు కలుపుకోవచ్చు. పెరుగుతో కూరలో ఎక్కువైన కారం తగ్గుతుంది. ఆ కూరకు రుచి, గ్రేవీ కూడా వస్తుంది. అదేవిధంగా కూరలో ఎక్కువైన కారాన్ని తగ్గించేందుకు దేశీ నెయ్యిని కూడా వాడుకోవచ్చు. నెయ్యి కూడా కారాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి పాలతో వంటల్లో కారం తగ్గించుకోవచ్చు :

కొబ్బరి పాలను కూరలో లేదా గ్రేవీలో ఉపయోగించడం ద్వారా వంటలో ఎక్కువైన కారాన్ని ఈజీగా తగ్గించకోవచ్చు. కొబ్బరి పాలు కారాన్ని తగ్గించడమే కాకుండా ఆహారం రుచిని కూడా పెంచుతాయి.

స్వీట్ రిసార్ట్:

వంటలో ఎక్కువైన మిర్చి ఘాటును తగ్గించడానికి మీరు కొద్దిగా చక్కెర లేదంటే బెల్లం కూడా వాడొచ్చు. దీంతో మీ ఆహారంలో ఎక్కువైన కారాన్ని తగ్గించవచ్చు. కూర, సాంబారులో లైట్‌గా తీపిగా ఉంటే ఇష్టపడే వారు మాత్రమే ఇలా చక్కెర, బెల్లం వాడితే మంచిది. లేదంటే, ఇతరులు ఆ వంటకాన్ని తినలేరు.

నిమ్మరసం:

నిమ్మరసం కూడా వంటల్లో మిరప ఘాటును తగ్గిస్తుంది. ఆహారంలో మిర్చి ఘాటు ఎక్కువైనప్పుడు అందులో దానికి సరిపడా నిమ్మరసం వేసుకుంటే ఆ వంటకం ఘాటు తగ్గుతుంది.

బంగాళాదుంప వాడకం:

ఉడికించిన బంగాళాదుంపల సహాయంతో మీరు మీ ఆహారంలో మిరప ప్రభావాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం, ఒకటి లేదా రెండు ఉడకబెట్టిన బంగాళాదుంపలను తీసుకొని వాటిని ఆ కూరలో వేసుకుని కాస్త ఉడికించుకోవాలి. ఆలూ మీ వంటలోని కారాన్నిపీల్చేసుకుంటుంది. దీంతో మిర్చి ఘాటును తగ్గిస్తుంది. ఈ చిట్కాలు పాటించి మీరు ఆహారంలో ఎక్కువైన కారాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!